Sreesanth three others sent to two day police custody

ipl spot-fixing scandal, sreesanth, ajit chandila, delhi police probe

Sreesanth, three others sent to two-day police custody

రెండు రోజుల కస్టడీ..?

Posted: 05/27/2013 11:24 AM IST
Sreesanth three others sent to two day police custody

స్పాట్ ఫిక్సింగ్‌లో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలాకు మరో రెండు రోజుల పోలీస్ కస్టడీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనూజ్ అగర్వాల్ అనుమతించారు. వీరిద్దరితోపాటు, బుకీలు చంద్రేష్ పటేల్, అశ్వనీ అలియాస్ టిపూలను కూడా ప్రశ్నించడానికి వీలుగా ఈనెల 28వ తేదీ వరకూ తమ కస్టడీలో ఉంచాలన్న పోలీస్ అధికారుల విజ్ఞప్తికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ఈ కేసులో అరెస్టయిన మరో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అంకిత్ చవాన్, మాజీ రంజీ క్రికెటర్ బాబూరావు యాదవ్, బుకీలు జిజూ జనార్ధన్, దీపక్ కుమార్, మానన్ భట్‌లను జూన్ నాలుగో తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

తాను నిర్దోషినని, పోలీసులు తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపిస్తూ, శ్రీశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, జూన్ రెండో తేదీన తన వివాహం జరగనుందని, కాబట్టి తనకు బెయిల్ ఇప్పించాలని న్యాయమూర్తిని చవాన్ కోరాడు. వీరిద్దరి బెయిల్ పిటిషన్లను ఈనెల 28వ తేదీన విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఢిల్లీ పోలీస్‌లు ఇప్పటి వరకూ మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ముగ్గురు బుకీల వేటలో తలమునకలయ్యారు. బుకీ మహమ్మద్ యాహ్యా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఐపిఎల్‌లోని మరో ఫ్రాంచైజీకి చెందిన మరో ముగ్గురు క్రికెటర్లకు స్పాట్ ఫిక్సింగ్‌లో సంబంధం ఉందని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు పిటిఐకి చెప్పాడు. అయితే,

ఆ ఫ్రాంచైజీ పేరునుగానీ, ఆటగాళ్ల వివరాలనుగానీ వెల్లడించడానికి నిరాకరించాడు. యాహ్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురు బుకీల ఆచూకీ కోసం వేట కొనసాగిస్తున్నట్టు చెప్పాడు. వారిని అదుపులోకి తీసుకుంటే, తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ముగ్గురు క్రికెటర్ల పాత్ర గురించిన సమాచారం తెలుస్తుందని అన్నాడు. విదేశీ క్రికెటర్లలో ఎవరూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు సమాచారం ఏదీ ప్రస్తుతానికి తమ వద్దలేదని చెప్పాడు. అయితే, విదేశీ ఆటగాళ్ల పాత్రను పూర్తిగా కొట్టేయడానికి వీలులేదని, ఎవరు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారో సమగ్ర సమాచారం సేకరించడానికి మరికొంత సమయం పడుతుందన్నాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more