క్రికెట్, ఇతర ఆటలకీ అక్కడ ప్రేక్షకులను అలరించే ఛీర్ లీడర్స్ కీ ఏం సంబంధం ఉండదు. వృత్తిరీత్యా కేరింతలు కొట్టటమే వారి పని. సన్ రైజర్స్ హైద్రాబాద్ కి, ముంబై ఇండియన్స్ కీ మధ్య హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ 6 మ్యాచ్ లో కూడా ఛీర్ గాల్స్ ప్రేక్షకులను అలరించారు. ఎందుకీ ఛీర్ గాల్స్. ఏమిటి వీళ్ళ అవసరం. వాళ్ళు ఎందుకలా యాంత్రికంగా నవ్వులు వెదజల్లుతారు.
మోడలింగ్ కి శరీర సౌష్టవంతో పాటు ముఖంలో అందం ఉంటే చాలు. వ్యాపార ప్రకటనల్లో పనిచేసేవారికి వాటితోపాటు నటనా కౌశలం కూడా ఉండాలి. ఇక ఛీర్ గాల్స్ కి వ్యాయామం, అథ్లెటిక్ క్రీడలు, డాన్స్ లలో కూడా అనుభవం ఉండాలి.
క్రీడాకారులకు ప్రోత్సాహంగా చేసే అరుపులు, ఈలలు లాంటివి వేరు. ఛీర్ గాల్స్ ప్రేక్షకుల కోసం ఉన్నవాళ్ళే కానీ క్రీడాకారుల కోసం కాదు. ఎయిర్ హోస్టెస్ నవ్వు పలకరింపులా, సేల్స్ మన్ చేసే స్వాగతంలా, ఛీర్ లీడర్స్ కూడా వృత్తిపరమైన కేరింతలు, చలాకీగా ఎగరటం చేస్తూ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని తెప్పిస్తారు.
భయాన్ని కలిగించే సినిమాలు చూస్తున్నప్పుడు సినిమా హాల్లో కూడా ఆ సీన్లు రాకముందే కొందరు గట్టిగా అరవటం లాంటివి చేస్తారు. గుండె దిటపు చేసుకునే పని అది. అలాగే, క్రీడల్లో మునిగిపోయి ఆ టెన్షన్ ని భరించలేకపోయినప్పుడు కొన్ని దేశాల్లో అల్లర్లకు కూడా దారితీసిన సంఘటనలున్నాయి. క్రీడాకారులు సరిగ్గా ఆడలేదని వాళ్ళ మీద కాని, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్ళు గెలిచారని వారి మీద కోపం చూపించటం లాంటివి తగని పనులు. ఆటను ఆటలా చూడాలన్నది నియమం కానీ, అందులో మునిగిపోయి ఒళ్ళు మరిచి ప్రవర్తించటం జరగకుండా ఈ ఛీర్ లీడర్స్ టెన్షన్ ని పోగొడతారు.
పాశ్ఛాత్య దేశాల్లో ఎక్కువ ఆదరణ పొందిన ఫుట్ బాల్ బేస్ బాల్ ఆటల్లో 1897 నుంచే ఛీర్ గాళ్స్ బృందాలను మైదానంలో దింపటం మొదలుపెట్టారు. మొదట్లో డాన్సింగ్ తో పాటు పిల్లి మొగ్గలు వెయ్యటమే కాకుండా పిరమిడ్ ఫార్మేషన్ లాంటి ప్రమాదకరమైన విన్యాసాలుండేవి. ఇప్పుడు కనిపిస్తున్న ఛీర్ గాళ్స్ సంస్కృతి 1980 నుంచి బాగా ఊపందుకుంది. 1983లో ఛీర్ లీడింగ్ పోటీలు నిర్వహించింది ఇఎస్ పిఎన్. ఆ తర్వాత ఛీర్ లీడింగ్ ఆర్గనైజన్స్ వారికి కొన్ని భద్రతా సూచనలిచ్చి ప్రమాదాలను అరికట్టారు. తర్వాత 1987లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఛీర్ లీడింగ్ కోచెస్ అండ్ అడ్వైజర్స్ పేరుతో సంఘం స్థాపించబడింది.
అథ్లటిక్ విన్యాసాల అభ్యాసం చేసేవారు పార్ట్ టైం జాబ్ గా ఛీర్ లీడింగ్ వృత్తిని ఎన్నుకునే వారు చాలామంది ఉన్నారు. 2000 లో ఇఎస్ పి ఎన్ విడుదల చేసిన బ్రింగ్ ఇట్ ఆన్ మూవీ వలన ప్రపంచ వ్యాప్తంగా ఈ వృత్తిలో ఆసక్తి కనపరచినవారు ఇంకా చాలామంది తయారయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, కొలంబియా, ఫిన్ ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నెదర్ ల్యాఁడ్, న్యూజిలాండ్, యుకె దేశాలలో లక్షమందికి పైగా ఛీర్ గాళ్స్ ఉన్నారని అంచనా.
ఇదొక వృత్తిగా తయారవటం వలన ఇందులో శిక్షణలు, అందులో వివిధ తరగతులు, స్థాయిలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇందుకు చాలా పరిశ్రమ అవసరం. అందుకే ఛీర్ గాళ్స్ ని తక్కువ చూపుతో చూసిన సందర్భాల్లో వాళ్ళకి కోపం వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. వారి విన్యాసాలతో కేరింతలతో ప్రేక్షకులను అలరించటమే కానీ వేరే విధమైన సంబంధాలేమీ పెట్టుకోరు. అందువలన వాళ్ళని కాల్ గర్ల్స్ లా చూసిన వారి పట్ల నిరసన కూడా తెలియజేసారు. అందరూ సులభంగా చెయ్యగలిగే పని కాదు ఛీర్ లీడింగ్ అనేది. క్రీడాకారులతో సమానమైన పరిశ్రమ చేస్తారు కాబట్టి క్రీడాకారులకేమీ తీసిపోరు. కానీ క్రీడలతో వాళ్ళకేమీ సంబంధం పెట్టుకోరు. కేవలం ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ క్రీడా సమయమంతా గడపడమే వారి పని. అందువలన వారికీ తగిన గౌరవం లభించాలని వారు కోరుకుంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more