Madhu yashki comment on trs party

madhu yashki vs trs, mp madhu yashki, trs party, kcr, telangana issue, congress party, trs party leaders, ys jagan, ysrcp, kvp, ys rajasekhara reddy, 2014 election, nizamabad mp madhu yashki goud, rajya sabha member kvp ramachandra rao,

madhu yashki comment on trs party

madhu-yashki.gif

Posted: 04/04/2013 07:59 PM IST
Madhu yashki comment on trs party

madhu yashki comment on trs party

కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధుయాష్కి తెలంగాణ ప్రజలకు సరికొత్త సంకేతాలను పంపించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వేసే అడుగులు, పొత్తుల గురించి  ఎంపీ మధుయాష్కి తెలంగాణ ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకునే  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. రాబోయో రోజుల్లో  ఆ పార్టీ యొక్క పాలసీలు ఏమిటో కూడా  మధుయాష్కి వివరించారు. కాంగ్రెస్ పార్టీ తో  కేసిఆర్ కుదుర్చుకుంటున్న చీకటి ఒప్పందం పై మధుయాష్కి తెలంగాణ ప్రజలకు చెప్పటం జరిగింది.  కాంగ్రెస్ పార్టీ తోనే తెలంగాణ వస్తుందని  ఎంపీ  అంటున్నారు. అంతేకాకుండా కేసిఆర్ పై కొన్ని విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్  వచ్చే ఎన్నికల గురించి ఆలోచించడం మానుకొని ప్రత్యేక తెలంగాణ సాధనపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి సూచించారు. ముందస్తు ఎన్నికలతో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో కేసీఆర్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో  అందరికి తెలుసునని మధుయాష్కి అన్నారు.  తెలంగాణ ప్రజలకు కేసిఆర్ వల్ల ఏమి ఉపయోగం లేదని ఆయన అన్నారు.  ఎంపీ మధుయాష్కి సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెసు, టిడిపిని బొంద పెట్టాలంటే వచ్చే ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ వెళతారా ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న జగన్ పార్టీతో ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కాంగ్రెస్‌లో విలీనం అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని మధుయాష్కి పేర్కొన్నారు. అలాగైతే జులై, ఆగస్టులలో తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలతో తెలంగాణ రాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దివంగత వైఎస్ ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శకుని పాత్ర పోషిస్తున్నారని మధుయాష్కి ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr badshah movie review
Arogyasri going to be dropped by private hospitals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more