Kamal hassa vs cm jayalalitha

kamal hassan, viswaroopam movie release, tamil nadau cm jayalalitha, kamal hassan press meet, viswaroopam movie, chief minister jayalalitha, tamilnadu high court,

kamal hassa vs cm jayalalitha

kamal.gif

Posted: 01/30/2013 07:49 PM IST
Kamal hassa vs cm jayalalitha

kamal hassa vs cm jayalalitha

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత మద్య  సినిమా యుద్దం నడుస్తోంది.  ఆయన నటించిన  విశ్వరూపం సినిమా పై  జయలలిత ఫిటిషన్ దాఖలు చేయటంతో  కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీంతో కమల్ హాసన్ కన్నీరు పెట్టుకోవటం జరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన నిర్మించిన 'విశ్వరూపం' చిత్రం విడుదలపై విచారణ జరిపిన కోర్టు స్టే విధించింది. ఫిబ్రవరి 4వ తేదీన కమల్ స్వయంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమల్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.  విశ్వరూపం చిత్రం తమిళనాడులో విడుదలైంది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా కొన్నిచోట్ల ప్రదర్శనను అధికారులు నిలిపివేశారు. మరోవైపు విశ్వరూపం చిత్ర విడుదలపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆరాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది.

kamal hassa vs cm jayalalitha

కమల్ హాసన్ నటించిన  విశ్వరూపం వివాదంపై కమల్  కంటతడి పెట్టాడు. విశ్వరూపం చిత్రం కోసం తన ఇల్లు, ఆస్తుల్ని మొత్తం తాకట్టు పెట్టానని కమల్‌ హాసన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఉండేందుకు వేరే రాష్ట్రం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో చోటు దొరక్కపోతే వేరే దేశానికి వెళ్లడం ఒక్కటే మార్గమని కమల్ హాసన్ ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.  విశ్వరూపం సినిమా విడుదలను అడ్డుకోవడం బాధ కలిగిస్తోందని కమల్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం తనను వెళ్లగొట్టాలని చూస్తోందని తెలిపారు. మరో వైపు విశ్వరూపం సినిమాపై స్టే ఎత్తివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని జయలలిత సర్కారు సవాల్‌ చేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ మధ్యాహ్నం కేసును పరిశీలించనుంది. అటు సింగిల్‌ జడ్జి ఆదేశాలున్నా తమిళనాడులో విశ్వరూపం సినిమాను నిలిపివేశారు. కోర్టు ఉత్తర్వు కాపీని చూపిస్తే సినిమా ప్రదర్శనను అనుమతిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila padayatra re start from feb 6th 2013
Raveena tandon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more