Nitin gadkari re election chances fails

Nitin gadkari,Sushma Swaraj,Rajnath Singh,Purti Group,Party President,Nitin gadkari,Narendra Modi,Congress,BJP President,Thawarchand Gehlot,

RSS has repelled attempts by a section of BJP leaders led by LK Advani to deny a second term to party president Nitin Gadkari.BJP is likely to announce the re-election of Gadkari on Wednesday

Nitin Gadkari re-election chances fails.png

Posted: 01/21/2013 02:30 PM IST
Nitin gadkari re election chances fails

Nitin_Gadkari

మొన్నటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కి రెండోసారి అధ్యక్ష్య పదవి కట్టబెట్టడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈనెల 23 ను నామినేషన్లు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన తరుణంలో ఈయన ఎంపిక పై ఆసక్తి నెలకొంది. గడ్కారీకి రెండోసారి అధ్యక్ష పదవి అప్పగించడంపై పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆరెస్సెస్ ఒత్తిడికి ఆయన తల ఒగ్గినట్లు తెలుస్తోంది. అద్వానీ శిబిరానికి, ఆరెస్సెస్ వర్గాలకు నడుమ వారం రోజులు గా చర్చోపచర్చలు సాగిన దరిమిలా, గడ్కారీకే రెండోసారి పగ్గాలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గడ్కారీ అధీనంలోని పూర్తి గ్రూప్ అవకతవకలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు రెండోసారి అవకాశం ఇవ్వరాదని, ఆయన బదులు రవిశంకర్‌ప్రసాద్‌కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అద్వానీ తొలుత సూచించా రు.

లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, సుష్మా, మోడీలు పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు విముఖత చూపారు. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ స్వయంగా గడ్కారీకి బాసటగా నిలుస్తుండటంతో, తిరిగి ఆయనే బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి ఓటమి చవిచూసిన తర్వాత గడ్కారీ పార్టీ పగ్గాలు చేపట్టారని, ఈసారి ఎన్నికల సారథ్యం వహించే అవకాశం ఆయనకు ఇవ్వాలని ఆరెస్సెస్ బలంగా వాదించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులు ఈ అంశంపై అధికారికంగా ఎలాం టి సమాచారం ఇవ్వడం లేదు. అధ్యక్ష పదవి ఎన్నికలపై మీడి యా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడగగా, తమది వారసత్వ పార్టీ కాదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tjac chief at cpi ml t sadassu
Rss behind samjhauta mecca masjid and malegaon blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more