Merry christmas special

Christmas,Christians, Bethlehem, Christmas, Jesus

Thousands enjoy merry Christmas in Bethlehem.

Merry Christmas special.png

Posted: 12/25/2012 11:20 AM IST
Merry christmas special

Yesu-Kristuక్రిస్మస్ పండుగను ప్రపంచంలోని క్రిస్టియన్స్ అందరు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ యొక్క విశేషాలేంటో చూద్దాం. క్రైస్తవ మత స్థాపకుడు. మానవ ప్రేమను ప్రబోధించిన కరుణామయుడు . ఆ దేవుడి కుమారుడే లోకానికి రక్షకుడిగా ఇలలో వెలసిన ఈ పవిత్రమైన రోజును క్రిస్టియన్లు పండుగలా జరుపుకుంటారు. యేసుక్రీస్తు ఈ లోక ప్రజలకు పాప విముక్తి కలిగించడానికి దివి నుండి దిగివచ్చిన ప్రేమమూర్తి. లోకరక్షకుడైన ఆ యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్‌ 25ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రింద బెత్లెహేము నగరంలో కన్నె మరియు, యోసే వులకు ముద్దుల బిడ్డగా ఒక పశువుల పాకలో జన్మించాడు యేసు. దేవదూతలు దిగివచ్చి అతని రాకను మానవాళికి తెలియజేశారు. అంతటి పవిత్రాత్మను స్మరించుకునే పండుగరోజు ఈ క్రిస్మస్‌. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆకాశంలో అతిపెద్ద నక్షత్రం వెలిసింది. ఇది మిగతా నక్షత్రాల కన్నా భిన్నంగా ఉంది. యేసు పుట్టి సమయంలో ప్రజలకు ఆ బాలుడి జన్మస్థానానికి దారి చూపిన ఆ తారకకు గుర్తుగా క్రిస్మస్‌ మాసం మొదలు కాగానే స్టార్‌ను ఇంటి ముందు పెట్టుకుని అలంకరించుకుంటారు.

christmas-tree‘క్రిస్మస్‌ ట్రీ’ని ప్రతిష్ఠించే వెనక ఆంతర్యం... మానవాళి పాపాలను పారద్రోలి పునీత ఛాయలనందించి సేదతీర్చే పవిత్ర వృక్షమే ఏసుక్రీస్తు అనే భావన. యేసుక్రీస్తు నీడలో మానవాళి ఆత్మ విశ్రాంతి పొందాలంటే సంకల్పమే ‘క్రిస్మస్‌ ట్రీ’ ఆచారంగా ఏర్పడింది. క్రిస్మస్‌ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్‌ తాత... శాంటాక్లాజ్‌. ఎర్రని దుస్తులతో ఈ తాత తన బగ్గీపై మంచు కొండల మీదుగా ఆకాశమార్గాన వచ్చి క్రిస్మస్‌ చెట్టుకు వేలాడదీసిన మేజోళ్లలో పిల్లల కోసం ఎన్నో బహుమతులు పెట్టి వెళతాడంట. దీని వెనుక ఉండే ఉద్దేశమంతా ఒక్కటే. మానవుడిని, ప్రకృతిని సృష్టించిన దేవుడి ప్రేమ ను తెలుసుకోవడమే. సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన వవిత్రమైన రోజే క్రిస్మస్‌. యేసు అనగా గ్రీకుబాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరి పేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం ‘రొట్టెల గృహం’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kerala home minister radhakrishnan target women cpi m mla
Women safe and secure in ap dgp dinesh reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more