నటి రోజా సినిమాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చామంతి పువ్వా లతో రొమాన్స్ చేసి అందరి చేత రోజ పువ్వులు పెట్టించుకుంది. నటి నుండి నాయకురాలిగా మారిన తరువాత అందరి పై రోజా ఎగిరెగిరి పడుతుందట. రోజ పువ్వు వెనక ఒక ముల్లు ఉన్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయ రోజా వెనక జగన్ అనే ముల్లు ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఆ ముల్లును చూసుకోని రాజకీయ పార్టీ నాయకులు ముందు విప్పి ఆరేస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి. రోజా పసుపు రంగు పుసుకున్నప్పుడు .. హస్తం వారికి చుక్కలు చూపించింది. పసుపు నుండి హస్తంలోకి ఐరన్ లెగ్ పెట్టే సమయంలో హస్తం ముఖ్యనేత ఫోటోకు రోజ పువ్వుల దండ వేసింది. అప్పటి నుండి మొడుగా మిగిలిన రోజా కు ..ఏడారిలో ఓయాసిస్సులా .. ఆ ముఖ్య నేత కుమారుడు కనిపించాడు. ఆయువనేతతో మంతనాలు జరిపి, కింద నాయకులతో కాలుజారి, పార్టీలో చేరినట్లు కొన్ని రాజకీయ పార్టీలు అప్పట్లో పుకార్లు పుట్టించాయి. పార్టీలో అవకాశం దొరికింది కదా అని రోజా మేకప్ తో తన అందాలను ఎరగా వేయాలని చూసిందట. అయితే ఆ యువనేత ఆమె అగడాలకు చెక్క్ పెట్టడంతో.. పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల ఒక మహిళ పాదయాత్ర చేయటంతో.. రోజాలో కొత్త కోరికలు వికసించినట్లు గా ఆమె పురివిప్పి నాట్యం చేయసాగిందట. పాదయాత్రలో అప్పుడప్పుడు మెరుపు తీగలా మెరుస్తు, మీడియా వారికి కొన్ని రోజలు చెవిలో పెడుతుందని మీడియా వారు అంటున్నారు. ఈ సారి రోజా తెలంగాణ గులాబి నాధులపై కన్నువేసినట్లు తెలుస్తోంది. గులాభి నాథులపై రోజా రెక్కలు విప్పి మాటలతో నాట్యం చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు లభిస్తోన్న ఆదరణను చూస్తేనే వైఎస్ఆర్‌పై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. షర్మిలతో కలిసి 44వ రోజు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. షర్మిల అడుగులో అడుగేసే ప్రతి ఒక్కరూ కుమ్మక్కు, నీచ రాజకీయాలను చీల్చి చెండాడే యోధులు అని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్‌ఎస్ నాయకులు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. ప్రజలు కోరుకున్న వాళ్లే నాయకులు అవుతారని విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాలేరన్నారు. వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉండి మనోధైర్యమిస్తున్న ప్రజలకు రోజా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more