Rahul gandhi focus

Congress general secretary Rahul Gandhi, rahul gandhi focus, rahul gandhi focus in ap, andhrapradesh state, sonia gandhi, congress party, congress leaders, political focus, congress mps, congress party mlas, centeral ministers, focus on party, Rahul Gandhi focus on AP politics,

rahul gandhi focus

rahul.gif

Posted: 11/17/2012 07:12 PM IST
Rahul gandhi focus

rahul gandhi focus

ఇప్పుడు మన రాష్ట్రంపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. అన్ని సమస్యల పరిష్కార బాధ్యతను దిగ్విజయ్‌కి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే డిగ్గీ రాజా హైదరాబాద్‌ రానున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితులపై రాహుల్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు ఏపీ కీలకమని భావించిన ఆయన.. సీట్లు చేజారకుండా చర్యలకు దిగారు. తన నేతృత్వంలోని సమన్వయ కమిటీలో సభ్యుడుగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పార్టీని చక్కదిద్దే బాధ్యతను అప్పజెప్పినట్టు సమాచారం. ఈ మధ్య రాష్ట్రానికి సంబంధించి ఏ ఇష్యూపై చర్చించినా... ఆజాద్, వాయలార్‌తో పాటు దిగ్విజయ్ కూడా ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట వార్ రూమ్‌లో జరిపిన చర్చలకూ హాజరయ్యారు. త్వరలోనే ఛార్జ్‌ తీసుకుని రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం.అయితే ఏఐసిసి పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర బాధ్యతల నుంచి ఆజాద్‌ను మారుస్తారనే ప్రచారం ఉంది. ఆయన స్థానంలో ఎవరిని ఇంఛార్జ్‌గా నియమిస్తారనే చర్చ మొదలైంది కూడా. ముకుల్ వాస్నిక్, అంబికాసోనీ లతో పాటు దిగ్విజయ్ పేర్లు ప్రచారంలోకొచ్చాయి. అలాగని డిగ్గీరాజాని పూర్తిస్థాయి ఇంఛార్జ్‌గా నియమించే అవకాశం లేకపోవచ్చు. రాహుల్ టీంలో సభ్యుడిగా, ఉత్తరాదిలోని కీలక రాష్ట్రాలపైనా ఆయన దృష్టి సారించాల్సి ఉంది.కాబట్టి పరిస్థితులను చక్కదిద్ది పార్టీని గాడిన పెట్టే వరకు మాత్రమే ఆయన పరిమితం కావచ్చని తెలుస్తోంది. తెలంగాణ సమస్యపైనా రాహుల్ దిగ్విజయ్‌కి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. అన్ని ప్రాంతాల నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం గ్రూపులుగా ఉన్న నేతలెవరూ డిగ్గీరాజా మాట మీరరనే నమ్మకం హైకమాండ్‌కు ఉంది. అందుకే దిగ్విజయ్ ఈ ప్రాబ్లమ్స్ పరిష్కారానికి సరైన వ్యక్తిగా రాహుల్ భావిస్తున్నారు. మరి, ఆయన రాకతో పార్టీ పరిస్థితి మెరుగుపడొచ్చని రాష్ట్ర నాయకులు కూడా చెప్తున్నారు. మరి, ఆయన ఎలాంటి ఫార్ములాను ప్రయోగిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonakshi sinha is excited to work
Chandrababu ready for elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh