Rss blames modi for anti gadkari campaign

nitin gadkari, narendra modi, bharatiya janata party, gujarat, ram jethmalani, rss ,yashwant ,mg vaidya, jaswant singh, narendra Modi behind anti-Gadkari campaign, rss party, rss blames modi, gadkari campaign, bjp

RSS blames Modi for anti-Gadkari campaign

RSS.gif

Posted: 11/14/2012 01:07 PM IST
Rss blames modi for anti gadkari campaign

RSS blames Modi for anti-Gadkari campaign

బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వెనుక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హస్తం ఉందంటూ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంజి వైద్య తీవ్ర ఆరోపణ చేశారు. గడ్కరీకి వ్యతిరేకంగా బిజెపి నాయకుడు రామ్‌జెఠ్మలానీ చేస్తున్న డిమాండ్ల వెనుక మోడీ హస్తం ఉందని వైద్య తన బ్లాగ్‌లో ఆరోపించారు. బిజెపి అధ్యక్ష పదవినుంచి గడ్కరీ తప్పుకోవాలని, అలాగే నరేంద్రమోడీని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ జెఠ్మలానీ డిమాండ్ చేయడమే ఇందుకు నిదర్శనమని వైద్య పేర్కొన్నారు. అయితే వైద్య చేసిన ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అటు ఆర్‌ఎస్‌ఎస్, ఇటు బిజెపిలు స్పష్టం చేశాయి. నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపి అధ్యక్ష పదవి నుంచి గడ్కరీ రాజీనామా చేయాలని ఏకకాలంలో రామ్‌జెత్మలానీ డిమాండ్ చేయడం వల్ల దీనివెనుక మోడీ ప్రమేయం ఉందన్న అనుమానం తనకు కలిగిందని వైద్య పేర్కొన్నారు. పైగా ప్రధానమంత్రిని కావాలన్న ఆకాంక్ష తనకేమాత్రం లేదని నరేంద్రమోడీ ఇంతవరకూ ఎక్కడా స్పష్టం చేయలేదని వైద్య పేర్కొన్నారు. కాగా, వైద్య వ్యక్తం చేసిన అభిప్రాయంతో గడ్కరీని వ్యతిరేకిస్తున్న వర్గం ఇరుకున పడగా, తమపై ఒకవర్గం కుట్ర పన్నిందన్న తమ అనుమానాలు నిజమని తేలుతోందని గడ్కరీ వర్గం ఖుషీగా ఉంది. సంఘ్ అధికార ప్రతినిధి హోదాలోకాక తన వ్యక్తిగత అభిప్రాయంగానే వ్యక్తం చేసినట్టు వైద్య వివరణ ఇచ్చినప్పటికీ గడ్కరీ వ్యతిరేక వర్గం ఇరుకున పడింది.

RSS blames Modi for anti-Gadkari campaign

గడ్కరీ రెండోసారి అధ్యక్షుడు కావడం ఇష్టంలేని ఒకవర్గం పనిగట్టుకుని కుట్ర చేస్తోందన్న అనుమానాలు ఆరోపణలను ధృవీకరించే తీరులో వైద్య అభిప్రాయాలు ఉన్నాయి. గడ్కరీ మాదిరి మోడీ కూడా సంఘీయుడే అయినప్పటికీ, ఆయనలా విధేయుడు కాదు. మోడీ వ్యవహార శైలిపై సంఘ్ ఇప్పటికే గుర్రుగా ఉంది. ప్రధాని కావాలన్న మోడీ ఆలోచనకు మోకాలాడ్డుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే ప్రధాన మంత్రి పదవి గురించి ఆలోచించవచ్చునని సంఘ్ స్పష్టం చేస్తోంది. గుజరాత్ విధానసభ ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయం సాధించినప్పటికీ, సంఘ్ తీసుకునే నిర్ణయంపైనే రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో వైద్య చేసిన వ్యాఖ్యలు పార్టీలో సమీకరణల మార్పుకు దారి తీసే అవకాశాలున్నాయి. మరోపక్క వైద్య చేసిన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. చివరకు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన గడ్కరీ స్వయంగా ఒక ప్రకటనలో గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు. గుజరాత్‌లో పార్టీ విజయం కోసం తామంతా సమైక్యంగా పని చేస్తున్నామనీ యావత్ పార్టీ మోడీకి కొండంత అండగా నిలబడుతోందని ప్రకటించారు. గడ్కరీ ఈమేరకు చేసిన ప్రకటనను పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suu kyi in india after 25 years
Tapsee upset with rumours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more