Sumathi Satakam in Telugu 51386 Sumathi Satakalu

Sumati satakalu

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అక్కరకున్ = అవసరము పడినపుడు, రాని = (ఉపయోగమునకు) రానటువంటి, చుట్టమున్ = బంధువును, మ్రొక్కినన్ = నమస్కరించినను, వరము = కోరికను, ఈని = ఈయనటువంటి, వేల్పున్ = దైవమును, మోహరమునన్ = యుద్ధమునందు, తాన్ = తానై, ఎక్కిన, పాఱని = పఱుగిడని, గుఱ్ఱమున్ ; గ్రక్కునన్ = (ఆలోచింపక) వెంటనే, విడువంగవలయున్ = విడవవలయును, కదరా = కదా!

Get the Sumathi Satakam పని పడినపుడు పలకరించని చుట్టమును, వరాలకోసం మ్రొక్కినా.. కోర్కెలీయని దేవుని, స్వారీకి వుపయోగపడని గుఱ్ఱమును తెలిసిన వెంటనే వదిలివేయాలి. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 03/28/2014 10:56 AM IST
Sumati satakalu

అక్కరకు రాని చుట్టము 

మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా 

నెక్కిన బాఱని గుఱ్ఱము 

గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ!

టీకా : అక్కరకున్ = అవసరము పడినపుడు, రాని = (ఉపయోగమునకు) రానటువంటి, చుట్టమున్ = బంధువును, మ్రొక్కినన్ = నమస్కరించినను, వరము = కోరికను, ఈని = ఈయనటువంటి, వేల్పున్ = దైవమును, మోహరమునన్ = యుద్ధమునందు, తాన్ = తానై, ఎక్కిన, పాఱని = పఱుగిడని, గుఱ్ఱమున్ ; గ్రక్కునన్ = (ఆలోచింపక) వెంటనే, విడువంగవలయున్ = విడవవలయును, కదరా = కదా!

తాత్పర్యము : పని పడినపుడు పలకరించని చుట్టమును, వరాలకోసం మ్రొక్కినా.. కోర్కెలీయని  దేవుని, స్వారీకి వుపయోగపడని గుఱ్ఱమును తెలిసిన వెంటనే వదిలివేయాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more