Vadodara stampede: SC dismisses plea against SRK ‘సుప్రీం’లో షారుఖ్ ఖాన్కు ఊరట.. కింది కోర్టు అదేశాల సమర్థన..

Shah rukh khan gets relief in 2017 stampede case sc says celebrities have equal rights

shah rukh khan, shah rukh khan sc case, vadodara stampede case shah rukh khan, srk, supreme court vadodara stampede case, srk supreme court case, supreme court relief srk, supreme court news, Madhubhai Solanki vadodara stampede case, Justice Ajay Raastogi, Justice CT RaviKumar, Gujarat High Court, National news, Celebrity news, Bollywood news

The Supreme Court refused to interfere with the Gujarat High Court order quashing a criminal complaint against actor Shah Rukh Khan for allegedly causing a stampede that led to a man’s death during the promotion of his film. Dismissed by a bench of Justices Ajay Rastogi and C T Ravikumar, the plea challenging the HC order had been filed by the complainant, Madhubhai Solanki.

‘సుప్రీం’లో షారుఖ్ ఖాన్కు ఊరట.. కింది కోర్టు అదేశాల సమర్థన..

Posted: 09/27/2022 02:34 PM IST
Shah rukh khan gets relief in 2017 stampede case sc says celebrities have equal rights

బాలీవుడ్ బాద్ షాగా ఖ్యాతి గడించిన నటుడు షారూఖ్ ఖాన్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2017లో నమోదైన కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను కొట్టివేసింది. వడోదర తొక్కిసలాట కేసు నుంచి షారుఖ్ ఖాన్ ను విముక్తుడ్ని చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2017లో షారుఖ్ ఖాన్ నటించిన ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన తన చిత్రబృందంతో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వస్తున్న సమాచారం అందుకున్న అభిమానులు తమ అభిమాన నటుడిని చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. ఇసుక వేసినా రాలనంత పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను చూసిన షారూఖ్ వారి ప్రేమ, అదరాభిమానాలతో పొంగిపోయాడు. వారికి తన తన చిత్రం తరపున ఏమైనా ఇవ్వాలని భావించి వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది.

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు షారూఖ్ ఖాన్ కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles