Town planning supervisor caught by ACB ఏసీబికి చిక్కిన బుల్లెట్ బండి పెళ్లికొడుకు అకుల అశోక్..

Bullet bandi song fame bridegroom trapped in acb bribe case

Akula Ashok, town planning supervisor, Badangpet Municipal Corporation, Saroornagar, A Srinivasa Raju, architect, Anti-Corruption Bureau, bribe case, Bullet Bandi, Devender Reddy, businessman, house construction permission, Rangareddy, Telangana, Crime

Akula Ashok, a town planning supervisor in Badangpet Municipal Corporation was trapped red-handed by the Anti-Corruption Bureau (ACB) here on Tuesday for allegedly demanding and accepting a bribe of Rs.30,000 from a complainant. The dance performance during Ashok’s marriage bharaat on ‘Bullet Bandi…’ song went viral on various social media platforms.

ఏసీబికి చిక్కిన బుల్లెట్ బండి పెళ్లికొడుకు అకుల అశోక్..

Posted: 09/21/2022 12:30 PM IST
Bullet bandi song fame bridegroom trapped in acb bribe case

‘నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సాయిశ్రియ-అశోక్ జంట మీకు గుర్తుందా? అప్పగింతల సమయంలో ఆ పాటకు భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాకెక్కి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ‘బుల్లెట్ బండి’ ఒరిజినల్ సాంగ్‌కు మరింత క్రేజ్ వచ్చి లక్షలాది వ్యూస్ లభించాయి. ఏడాది క్రితం ఈ ఘటన జరిగింది.  ఇక ఆ పాటతో రాత్రికి రాత్రే పాప్యులర్ అయిపోయిన పెళ్లికొడుకు ఆకుల అశోక్. ఈ అశోక్ పెళ్లి ఎంత ఘనంగా జరిగినా.. పెళ్లికూతురు సాయిశ్రియ తన భర్తతో కలసి వేసిన పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైయ్యారు ఈ కొత్తజంట.

బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సాయిశ్రియ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే యంగ్ జనరేషన్ కు చెంది.. పాటతో పాపులర్ అయిన అశోక్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తూ.. తన యుక్త వయస్సులోని అలోచనలకు అనుగూణంగా లంచాలను వ్యతిరేకించడం చేసేందుకు బదులు.. ఆయనే స్వతహాగా లంచాన్ని తీసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లితో వచ్చిన పాపులారిటీని లంచం తీసుకోవడంతో లంచావతారంగా మారిపోయింది.

యువభావాలు కలిగిన ఉద్యోగిగా తనకంటూ ఓ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అశోక్.. తన చేజేతులా తన పవువును తానే తీసుకున్నాడు. ఓ పని చేయడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణం విషయంలో తన వద్దకు వచ్చిన దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి అశోక్ లంచం డిమాండ్ చేశాడు. అతడు నిన్న లంచం సమర్పించుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత కార్యాలయంతోపాటు అశోక్ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సత్కార్యములు చేస్తూ కీర్తి గోచరిస్తుంది.. లేకపోతే అపకీర్తి చుట్టుముడుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles