Speeding truck kills 4 sleeping on road divider in Delhi డివైడర్‌పై పడుకున్నవారి మీదనుంచి వెళ్లిన లారీ.. నలుగురు మృతి

Four killed as speeding truck runs over people sleeping on road divider in seemapuri

delhi accident, seemapuri, speeding truck, road divider, seemapuri accident, road accident, dtc bus depot, seemapuri divider incident, delhi police, delhi

Four people were killed and two injured after an unidentified speeding truck ran over people sleeping on the road divider in Delhi’s Seemapuri, said police. Police said the incident took place around 1:51am when the truck was crossing DTC Depot red light in Seemapuri.

డివైడర్‌పై పడుకున్నవారి మీదనుంచి వెళ్లిన లారీ.. నలుగురు మృతి

Posted: 09/21/2022 11:38 AM IST
Four killed as speeding truck runs over people sleeping on road divider in seemapuri

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు డివైడర్‌ నే తమ అవాసంగా చేసుకుని ఆదమరచి నిద్రిస్తున్నవారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సీమాపురి డీటీసీ డిపో వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ అర్థరాత్రి వేళ అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ట్రక్కు డ్రైవర్ ట్రాపిక్ సిగ్నల్ ను పట్టించుకోకపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని సీమాపూరి ప్రాంతంలోని డీటీసీ డిపో వద్ద కొందరు డివైడర్ పై పడుకున్నారు. అయితే రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రయ్య్ మంటూ దూసుకువచ్చిన ఓ ట్రక్కు.. ట్రాఫిక్ సిగ్నల్ ను పట్టించుకోలేదు. ఈ క్రమంలో సిగ్నల్ పడటంతో అటుగా వెళ్తున్న వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్నవారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు మరణించారు.

బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ పై నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో పాటు రోడ్డు దాటుతున్న మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును కనుక్కునేందుకు పోలీసుల ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. మరణించిన నలుగురిని కరీం(52), చోట్టే ఖాన్లు(25), షా ఆలం(38), రాహుల్ (45)గా గుర్తించారు. గాయడిన వారిలో 16 ఏళ్ల మనీష్, 30 ఏళ్ల ప్రదీప్ ఉన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ట్రక్కు డ్రైవర్ కోసం వేట సాగిస్తున్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles