Vaidhaa Actress Deepa Dies By Suicide ప్రేమ విఫలమై.. తమిళ సినీనటి దీప్తీ ఆత్మహత్య..

Tamil actress deepa aka pauline jessica found dead after hanging

Deepa, deepa no more, deepa suicide, deepa hanging herself, young tamil actress deepa, Pauline Jessica, Pauline Jessica found dead, Tamil actress, Tamil actress Deepa, Deepa aka Pauline Jessica, lyricist Kabilan's daughter, Thoorigai death, Vaidhaa, Love affair issues, Thupparivalan, Virugambakkam, Chennai, Tamil film industry, kollywood, Movies, Entertainment

Young Tamil actress Deepa, whose actual name was Pauline Jessica, committed herself at 29, when she still had a promising future in Tamil film ahead of her, most likely due to unresolvable problems in her love life. The Tamil cinema industry has been stunned by the passing of yet another celebrity.

తమిళ సినీనటి దీప్తీ ఆత్మహత్య.. ప్రేమ విఫలం కావడంతో..

Posted: 09/19/2022 12:12 PM IST
Tamil actress deepa aka pauline jessica found dead after hanging

తమిళ సినీ పరిశ్రమలో మరోమారు విషాధఛాయలు అలుముకున్నాయి. ఇటీవల గేయరచయిత కబిలన్ తనయ తూరిగై ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే మరో విషాధ ఘటన కాలీవుడ్ ను ముంచేసింది. తమిళ యువసినీనటి దీప అలియాస్ పౌలిన్ జెస్సిక (29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలో తానుండే ఫ్లాట్‌లోనే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సినీపరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువనటి.. ఇలాంటి దారుణ నిర్ణయాన్ని తీసుకోవడంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది.

అమె స్నేహితులు, బంధవులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం ఆమెకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడు ప్రభాకరన్ ఆమె ఫ్లాట్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించారు. ప్రేమలో విఫలమైన దీప.. అంతిమ నిర్ణయం తీసుకుందని ప్రభాకరన్ అనుమానం వ్యక్తం చేశారు. దీప మృతి విషయమై ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమె రాసిన మరణవాంగ్మూలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ లేఖలో దీప.. తన మృతికి ఎవరూ కారణం కాదని పేర్కోన్నారు. తాను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపోవడంతో తానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. దీప సొంత ఊరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఇంద్రానగర్‌. దీంతో పోస్టుమార్టం అనంతరం అమె అంత్యక్రియలు ఇంద్రనగర్ లో జరగేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. తమిళ సినీ పరిశ్రమలోని గేయ రచయిత కబిలన్ తనయ తూరిగై కూడా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. అమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అమె అఘాయిత్యానికి పాల్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh