IMD issues yellow alert in south Telangana districts రానున్న 3 రోజుల్లు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Imd issues yellow alert for 3 days in parts of telangana

rain alert for telangana, weather updates, telangana weather news, imd rain alert for telangana, rain alert, rains in telangana, imd rain alert, hyderabad rains, yellow alert, weather updates, telangana weather news, telangana, weather

The Indian Meteorological Department (IMD) on Saturday issued a yellow alert for the next three days for heavy rains and thunderstorms that are likely to occur in parts of Telangana. Heavy rains are likely to occur in areas such as Jogullamba gadwal, Naranyanapet, wanaparthy, Nagar kurnool, Vikarabad, Mahaboobnagar, Rangareddy, Bhuvanagiri, Mahabubabad, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Warangal rural districts of Telangana.

కామన్ బాయ్ ఫ్రెండ్ కోసం ఇరానున్న 3 రోజుల్లు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Posted: 08/27/2022 07:29 PM IST
Imd issues yellow alert for 3 days in parts of telangana

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్టల్‌ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారణ శాఖ తెలిపింది.

చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని.. అనేకచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృత్తమైన ఉంటుందని పేర్కొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముందని తెలిపింది. వాయువ్య ఉత్తర దిశలనుంచి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలాఉండగా ఉత్తర భారతం భారీ వర్షాలతో అల్లాడిపోతోంది.

భారీ వర్షాలతో గతవారమంతా అల్లాడిపోయిన ఉత్తరాఖండ్​, ఒడిశా ప్రజలకు ఐఎండీ అధికారులు మరో పిడుగులాంటి వార్తను అందించారు. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యెల్లో అలర్ట్​ జారీ చేసింది. అదే సమయంలో.. రాజస్థాన్​లో వర్షాలు కాస్త శాంతించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మహానది, సురనరేఖ నదుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన వరదల నుంచి ఒడిశా ఇంకా కోలుకోలేదు. మయూర్​భంజ్​, బాలాసోర్​, కియోఝర్​, కటక్​, జైపూర్​, భద్రక్​, బౌధ్​, నయాగఢ్​, ఖుర్ద, రాయగడ, కోరపుట్​, మల్కన్​గిరి, నబరంగ్​పూర్​, గజపతి, గంజమ్​, అంగుల్​లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. యెల్లో అలర్ట్​ని ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles