Chinese vessel reaches Sri Lanka’s Hambantota port భారత్‌ అభ్యంతరాల మధ్య.. హంబన్‌తోట పోర్ట్‌కు చేరిన చైనా నౌక

Chinese research ship yuan wang 5 docks at sri lanka s hambantota port

Yuan Wang 5, Hambantota, Sri Lanka, China, India, Chinese research ship, Chinese ballistic missile ship, satellite tracking ship, Ministry of Defence, Hambantota, Chinese Embassy, Colombo, beijing, chinese embassy, Sri Lankan port, India Protests, Defence news

A high-tech Chinese research ship docked at Sri Lanka‘s southern port of Hambantota, days after Colombo asked Beijing to defer the port call amidst India’s concern over the vessel’s presence in its neighbourhood. Chinese ballistic missile and satellite tracking ship ‘Yuan Wang 5’ arrived in the southern port of Hambantota at 8.20 am local time. It will be docked there till August 22, officials said.

భారత్‌ అభ్యంతరాల మధ్య.. హంబన్‌తోట పోర్ట్‌కు చేరిన చైనా నౌక

Posted: 08/16/2022 02:54 PM IST
Chinese research ship yuan wang 5 docks at sri lanka s hambantota port

భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 హంబన్‌తోట పోర్ట్‌కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో సాంకేతికంగా అత్యాధునికమైన నిఘా నౌక డాకింగ్‌పై అభ్యంతరం తెలిపింది. 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్‌ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది.

శ్రీలంక అప్పు చెల్లించలేక హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్లకు తనఖా పెట్టినప్పటి నుంచి భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తోంది. చైనా నౌక ఆగస్టు వారం రోజుల పాటు హంబన్‌తోట ఓడరేవులో ఆగనున్నట్లు తెలుస్తున్నది. ఈ చైనీస్‌ నౌక యువాన్‌ వాంగ్‌-5 షిప్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, ఉప్రగహాలను సైతం ట్రాక్‌ చేస్తుంది. ఈ క్రమంలో నౌకలోని ట్రాకింగ్ సిస్టమ్‌లు తీర ప్రాంతంలోని భారత భద్రతా మౌలిక సదుపాయాల గురించి సమాచారాన్ని సేకరించవచ్చని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles