Bollywood Singer Booked for Raping Costume Stylist కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై బాలీవుడ్ గాయకుడి అత్యాచారం..

Fir against singer rahul jain for raping costume stylist in his mumbai flat he says allegation baseless

Rahul Jain, Rahul Jain FIR, Rahul Jain singer, Rahul Jain singer rape, Rahul Jain rape, Rahul Jain FIR news, Rahul Jain accused of rape, Rahul Jain rape case, Rahul Jain songs, Rahul Jain latest news, Rahul Jain FIR, costume stylist, Andheri flat, Mumbai Flat, Crime news

Rahul Jain contacted the woman on Instagram and praised her work. He asked her to visit his flat located in a high rise in suburban Andheri. She was promised to be appointed as his personal costume stylist.

కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై బాలీవుడ్ గాయకుడు రాహుల్ జైన్ అత్యాచారం.. కేసు నమోదు

Posted: 08/16/2022 03:57 PM IST
Fir against singer rahul jain for raping costume stylist in his mumbai flat he says allegation baseless

బాలీవుడ్ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై ఎఫ్ఐఆర్ నమోదు. కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం బీటౌన్ లో కలకలం రేపుతోంది. తన ముంబై ఫ్లాట్ లో ఉన్న 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇన్‌స్టాగ్రాంలో త‌న‌ను ప‌రిచ‌యం చేసుకున్న రాహుల్ జైన్ త‌నను తన ఫ్లాట్ కు రమ్మని పిలిచాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఇన్‌స్టాగ్రాంలో తాను చేసిన పనిపై ప్రశంసలు కురిపించిన ఆయన ఆహ్వానం మేరకు అంధేరిలోని రాహుల్ జైన్ ఫ్లాట్‌కు వచ్చిన కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడని అమె  పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. తనను ఇన్‌స్టాగ్రాంలో త‌న‌ను ప‌రిచ‌యం చేసుకున్న రాహుల్ జైన్ త‌న వ‌ర్క్ గురించి ప్ర‌శంస‌లు గుప్పించాడ‌ని అంధేరిలోని త‌న ఫ్లాట్‌కు రావాల‌ని ఆహ్వానించాడ‌ని కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పేర్కొంది. తనను పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా నియమించుకుంటానని చెప్పాడం.. తనకు వచ్చిన ఆఫర్ తో ఉబ్బితబ్బిబైన బాధితురాలు.. రాహుల్ జైన్ ఫ్లాట్ కు వెళ్లింది.

తనను ఇంటర్వ్యూ పేరుతో బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. తాను ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా అత్యాచారం చేశాడని... సాక్ష్యాలను తొలగించాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో రాహుల్ జైన్ పై పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశామ‌ని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని రాహుల్ జైన్ తెలిపాడు. గతంలో కూడా మరో మహిళ తనపై అత్యాచారం కేసు పెట్టిందని చెప్పాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ లో ఓ మహిళ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles