CEC media certification committee gives shock to BJP బీజేపీకి ఈసీ షాక్.. టీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్!

Big relief to trs cec media certification committee gives shock to bjp

BJP Telangana,Telangana Rashtra Samithi,BJP and TRS,Telangana CM, K. Chandrasekhar Rao, Narendra Modi, TRS, BJP, CM KCR, Central Election Commission, media certification committee, Saalu Dora Selavu Dora, Slogan, Telangana protest, trs bjp clash, trs bjp fight, Telangana, Politics

The TRS and BJP are locked in a hoardings’ war with slogans against each other’s leaders in the main thoroughfares of Hyderabad during national executive meeting of BJP. BJP that started the campaign on hoardings targeting Chief Minister K. Chandrasekhar Rao, with the slogan reminding him that “enough is enough”. Now The CEC media certification committee gives shock to BJP, stating to stop this campaign on Thursday.

బీజేపీకి ఈసీ షాక్: సీఎం కేసీఆర్ పై అలా ప్రచారం చేయడానికి వీల్లేదు..

Posted: 08/11/2022 03:58 PM IST
Big relief to trs cec media certification committee gives shock to bjp

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనకు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ 'సాలు దొర.. సెలవు దొర' పేరుతో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రచారంపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇవాళ గట్టి షాక్ తగిలింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది.

'సాలు దొర‌.. సెలవు దొర' అంటూ సీఎం ఫొటోలు, పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని పేర్కొంటూ.. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్ కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మీడియా సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో కమిటీ నియామకం జరిగింది.

జాతీయ పార్టీలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తాము చేసే ప్రచారానికి సంబంధించిన అన్ని విషయాలపై సర్టిఫికేషన్ కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. తాము అనుమతించని వాటిని ప్రచారంలో ఉపయోగించే పార్టీలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం సర్టిఫికేషన్ కమిటీకి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రచారానికి అనుమతి ఇవ్వాలని గత నెలలో మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది.

అయితే ప్రచార టైటిల్, సీఎం ఫొటోలు వాడే విధానం, అందుకు పెడుతున్న క్యాప్షన్ లు అభ్యంతరకారంగా ఉన్నాయని అభిప్రాయ పడుతూ బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ ప్రారంభించిన 'సాలు దొర.. సెలవు దొర' క్యాంపెయిన్‌కు బ్రేక్ పడనుంది. రాజకీయ పార్టీల ప్రచార విధివిధానాలు ప్రజలకు తమ పార్టీ గురించి అవగతం అయ్యేలా ఉండాలే తప్ప.. ప్రత్యర్థి పార్టీల తప్పిదాన్ని ఎత్తిచూపేలా ఉండరాదని కమిటీ అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయం టీఆర్ఎస్ వర్గాలకు బిగ్ రిలీఫ్‌గా మారనుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles