Delhi Govt Makes Wearing of Face Masks Mandatory అలర్ట్.. ఫేస్ మాస్క్ తప్పనిసరి.. లేదంటే బాదుడు షురూ.!

Mask mandatory in delhi again rs 500 fine for not wearing facemasks

delhi face mask compulsory, delhi covid, delhi covid cases today, Omicron BA 2.75, Coronavirus, Delhi new omicron variant, New omicron, genome sequencing, Omicron sub-variant BA.2.75, Covid-19, corbevax, booster dose, covid-19, covid vaccination, dgci, emergency use, Emergency Use Listing, WHO, World Health Organisation, union health secretary, rajesh bhushan, corbevax vaccine, Corbevax, Covaxin, Covishield, Corona vaccine, India

As the national capital is seeing a sharp rise in the number of daily Covid-19 cases, the Delhi government reiterated that wearing masks in public places is mandatory and a fine of ₹500 is to be imposed on violators. According to a notice issued by the additional district magistrate office of South Delhi, wearing masks in all public areas is now mandatory and a fine of ₹500 will be imposed on the violators.

అలర్ట్.. అలర్ట్.. ఫేస్ మాస్క్ తప్పనిసరి.. లేదంటే బాదుడు షురూ.!

Posted: 08/11/2022 01:46 PM IST
Mask mandatory in delhi again rs 500 fine for not wearing facemasks

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బిఏ 2.75 కేసులు విజృంభిస్తున్నాయి. ఈ వేరియంట్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఢిల్లీలో కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఆరోగ్యశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దాంతో పాటు పలు ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో బౌతిక దూరాన్ని పాటించాలని కూడా సూచనలు చేసింది.

ప్రజలు తప్పనిసరిగా శానిటైజర్ తో తమ చేతులను శుభ్రం చేసుకోవాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక మాస్కులు ధరించని ప్రజలపై బాదుడుకు కూడా సిద్దమైంది. అయితే డబ్బులు వసూళ్లు చేయడం తమ ఉద్దేశం కాదని, ఈ ఆంక్షతోనైనా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించి.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2.75 బారిన పడకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తమ ఆంక్షలను తేలిగ్గా తీసుకుని మాస్కులు ధరించనివారిపై రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,100 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్లేసుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. కారులో ప్రయాణించేటప్పుడు మాత్రం ఈ నిబంధనలు వర్తించదని పేర్కొంది. కాగా, ఇటీవల ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతూ వస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యం కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు భావిస్తున్నారు. అందుకే కరోనాను కట్టడి చేయాలని ఈ నిబంధనలను అమలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగినా.. మరణాల రేటు తక్కువగా నమోదవుతోంది. ఇప్పటికే దేశంలో 8 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ను అరికట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles