ED recovers Rs 15cr cash, gold from Arpita's second house అర్పిత బెల్గోరియా ఫ్లాట్‌ నుంచి రూ.15కోట్ల నగదు స్వాధీనం

Ed conducts raid on another flat of arpita mukherjee finds huge cache of money

partha chatterjee arrest, partha chatterjee ed custody, who is arpita mukherjee, arpita mukherjee, Belgharia Flat, currency notes, ESI hospital, Health checkup, Enforcement Directorate (ED), money trail, teacher recruitment scam, West Bengal, Crime

The Enforcement Directorate (ED), which is probing the money trail of the teacher recruitment scam in West Bengal, on Wednesday is conducting raids on four places, including a flat owned by Arpita Mukherjee, a close aide of arrested state minister Partha Chatterjee, in Belgharia and recovered a huge cache of currency notes. Earlier on Saturday, the ED had seized ₹21.9 crore in cash from another flat owned by Arpita.

టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాం: అర్పిత ముఖ‌ర్జీ బెల్గోరియా ఫ్లాట్‌ నుంచి రూ.15కోట్ల నగదు స్వాధీనం

Posted: 07/27/2022 09:28 PM IST
Ed conducts raid on another flat of arpita mukherjee finds huge cache of money

పశ్చిమ బెంగాల్ టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌క‌తా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఐదు ప్ర‌దేశాల్లో దాడులు చేప‌ట్టింది. ఈ స్కాంలో అరెస్ట‌యిన మంత్రి పార్ధ‌ఛ‌ట‌ర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖ‌ర్జీకి చెందిన ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలోని బెల్గోరియా నగరంలోని రథ్ తల ప్రాంతంలోని ఫ్లాట్‌కు చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. దీంతో అమెకు చెందిన రెండో ఫ్లాట్ నుంచి అధికారులు ఏకంగా రూ. 15 కోట్లకు పైగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా నగదు, బంగారాన్ని అధికారులు లెక్కిస్తున్నారు.  

ఈ ప్లాట్ కు చేరుకున్న అధికారులకు అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో బ్యాంకు అధికారులను రంగంలోకి దింపిన అధికారులు.. ఏకంగా ఐదు కౌంటింగ్ మిషన్ల సాయంతో వాటిని లెక్కిస్తున్నారు. కాగా ఇంకా నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏకంగా రూ. 15 కోట్ల విలువైన నగదు, బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పిత ముఖ‌ర్జీకి చెందిన కోల్‌క‌తా ఫ్లాట్‌లో గ‌త‌వారం ఈడీ అధికారులు రూ 22 కోట్ల న‌గ‌దు, 20కి పైగా మొబైల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రిక్రూట్‌మెంట్ స్కాంలో అర్పిత ముఖ‌ర్జీని ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన మ‌ర్నాడే తాజా దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అర్పిత ముఖ‌ర్జీని ఆగ‌స్ట్ 3వ‌రకూ ఈడీ క‌స్ట‌డీని కోర్టు అనుమ‌తించింది. ఇక ఇదే కేసులో మంత్రి పార్ధ ఛ‌ట‌ర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, త‌న ఇంటితో పాటు మ‌రో మ‌హిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్‌లా మంత్రి పార్ధా వాడుకున్న‌ట్లు తెలిపింది. మ‌రో మ‌హిళ కూడా మంత్రి పార్ధాకు స‌న్నిహితురాల‌ని అర్పిత వెల్ల‌డించింది.

త‌న ఇంటిలోని రూమ్‌లో ఎంత సొమ్ము ఉందో మంత్రి ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌న్న‌ది. ఓ బెంగాలీ న‌టుడు త‌న‌ను మంత్రి పార్ధాకు ప‌రిచ‌యం చేయించాడ‌ని, 2016 నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. ట్రాన్స్‌ఫ‌ర్లు, కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాల‌దే ఆ డ‌బ్బు మొత్తం అని ఆమె తెలిపింది. కానీ ఆ డ‌బ్బును మంత్రి ఎప్పుడూ తీసుకురాలేద‌ని, అత‌ని మ‌నుషులు మాత్ర‌మే తెచ్చేవార‌ని ఆమె చెప్పింది.. తాజాగా మరో 15 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles