After COVID-19, new deadly Marburg virus is here మార్ బ‌ర్గ్ వైరస్ సోకితే ఎనమిది రోజుల్లో మరణం సంభవిస్తోందా.?

Marburg virus detected in ghana all about this highly infectious disease

marburg virus, ghana, symptoms, diarrhoea, fever, nausea, vomiting, Virus, Marburg Virus Ghana, Ebola marburg virus, Disease outbreak, WHO, Ghana

Amid the COVID-19 pandemic, two cases of deadly Marburg virus disease have been detected. The WHO has confirmed that two cases of the deadly Marburg virus have been identified in Ghana. Marburg virus is a highly infectious disease in the same family as the virus that causes Ebola

కరోనా తరహాలో మరో మహమ్మారి.. మార్ బ‌ర్గ్ వైరస్ తో అంత ప్రమాదమా.?

Posted: 07/22/2022 03:41 PM IST
Marburg virus detected in ghana all about this highly infectious disease

క‌రోనా మహమ్మారి విజృంభన నుంచి రెండేళ్లుగా ఇప్పటికీ బయటపడని ప్రపంచాన్ని తాజాగా కొత్త వైర‌స్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. ఎబోలా, మంకీపాక్స్ ల‌కు తోడు మార్‌బ‌ర్గ్ అనే మ‌రో వైర‌స్ వ‌చ్చి చేరింది. ఘ‌నాలో బ‌య‌ట‌ప‌డిన ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో).. ఈ వైర‌స్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారిలా ప్ర‌పంచ‌మంతా విస్త‌రించ‌క‌ముందే నియంత్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. మార్‌బ‌ర్గ్‌తో మ‌ర‌ణించిన వారిని కాంటాక్ట్ అయిన దాదాపు 98 మందిని ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి వారిని ప‌రీక్షిస్తోంది. ఈ క్ర‌మంలో మార్‌బ‌ర్గ్ వైర‌స్ అంటే ఏంటి? ఈ వైర‌స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? దీని ల‌క్ష‌ణాలేంటి ? వంటి విష‌యాలు తెలుసుకుందాం..

మార్‌బ‌ర్గ్ వైర‌స్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక ర‌క‌మైన హెమ‌రేజిక్ ఫీవ‌ర్ వైర‌స్‌నే. అడ‌వుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గ‌బ్బిలాలలో ఈ వైర‌స్ ఎక్కువ‌గా ఆవాసం ఉంటుంది. ఈ వైర‌స్ మ‌నుషుల్లో క‌నిపించ‌డం ఇది తొలిసారేమీ కాదు. ఉగాండాలోని ఆఫ్రిక‌న్ గ్రీన్ మంకీస్ ద్వారా ఈ వైర‌స్ మ‌నుషుల్లోకి సంక్ర‌మించింద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. 1967లో మొద‌టిసారి జ‌ర్మ‌నీలోని మార్‌బ‌ర్గ్ సిటీలో ఈ వైర‌స్‌ను గుర్తించారు. అందుకే ఈ వైర‌స్‌కు మార్‌బ‌ర్గ్ అని పేరు పెట్టారు. ఈ వైర‌స్ సోకిన వారిలో మ‌ర‌ణాల రేటు 24 నుంచి 88 శాతంగా ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.

వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, స్రవాలను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైర‌స్ మ‌నిషి శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత 2 నుంచి రోజుల వ‌ర‌కు స‌జీవంగా ఉంటుంది. ఈ వైర‌స్ సోకిన వారిలో అధిక జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, తిమ్మిర్లు, వాంతులు, విరోచ‌నాల వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 5 నుంచి 7 రోజుల మ‌ధ్య‌లో ముక్కు, చిగుళ్లతో పాటు వాంతులు, మ‌లం ద్వారా ఎక్కువ‌గా ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంది. ఇలా అధికంగా ర‌క్తాన్ని కోల్పోవ‌డం వ‌ల్ల 8 నుంచి 9 రోజుల్లోనే చ‌నిపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

మ‌ర్బ‌ర్గ్ వైర‌స్ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే.. అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే చేయి దాటిపోయే ప్ర‌మాదం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. ఈ వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. ఎందుకంటే ప్ర‌స్తుతానికి ఈ వైర‌స్‌కు ఎటువంటి చికిత్స గానీ.. వ్యాక్సిన్ గానీ లేదు. ఫ్లూయిడ్స్ ద్వారా హైడ్రేట్‌గా ఉంచ‌డంతో పాటు, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా చూసుకోవ‌డం ద్వారా రోగి జీవించే అవ‌కాశాలు మెరుగుప‌ర‌చ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఈ వైర‌స్ సోకకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles