Parliament adjourned for the day amid ruckus by Oppn MPs పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలు.. వాయిదా..

Parliament adjourned for the day as oppn mps protest inflation rupee tumble

parliament monsoon session, monsoon session 2022, parliament session, lok sabha, rajya sabha, gst hike, congress, aap, gandhi statue, om birla, pm modi, amit shah, monsoon session parliament, monsoon session, parliament news, lok sabha news, rajya sabha news, monsoon session news, Lok Sabha, Monsoon session, Parliament, Rajya Sabha, parliament agenda today, parliament monsoon session, parliament session, monsoon session of parliament, Parliament Monsoon Session 2022, Parliament Session July 2022, Parliament Monsoon Session 2022 Bills, opposition protests, congress, rahul gandhi, congress protests parliament, monsoon session, parliament, lok sabha, rajya sabha, opposition protests, congress, Inflation, price raise, Ruppee tumble, National Politics

After the second day of the Monsoon Session was marred by adjournments, Day 3 of the Session was also marked by disruptions and sloganeering by Opposition MPs over various issues including price hikes and inflation.

పార్లమెంటు ఉభయసభలు వాయిదా.. ‘గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ అగేన్’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన

Posted: 07/20/2022 04:48 PM IST
Parliament adjourned for the day as oppn mps protest inflation rupee tumble

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా మూడవరోజు కూడా విపక్షాల నిరసనలతో దద్దరిల్లాయి. గంధరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటు ఉభయసభలు గురువారానికి వాయిదా వేయబడ్డాయి. జీఎస్టీ పెంపు, రూపాయి క్షీణత, ధరల పెరుగుదల అంశాలపై విపక్షాలు సభలో నిరసనలు తెలిపాయి. గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ అగేన్ అంటూ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రైతులపై కక్షగట్టిన ప్రభుత్వం.. వ్యవసాయోత్పత్తులైన పెరుగు, పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీని విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సహా యూపీఏ పక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో లోక్​సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.

ధరల పెరుగుదల, రోజువారీ వస్తువులపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తుండటం వల్ల లోక్ సభలో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఉదయం భేటీ అయిన నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడగా.. ఆ తర్వాత సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కార్యకలాపాలు సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల.. సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత గురువారానికి వాయిదా పడింది.

సభను వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహించేది చర్చల కోసమే కానీ, నినాదాల కోసం కాదని హితవు పలికారు. 'ప్రజలు సభల నుంచి చర్చలు ఆశిస్తున్నారన్నారు. సభ్యులు గొడవ చేస్తూ సభ పరువు తీస్తున్నారు. రచ్చ చేస్తున్న సభ్యుల తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు భంగం కలిగిస్తోంది. అంశాల వారీ చర్చల కోసం నిబంధనల ప్రకారం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. జీరో అవర్‌లో ఏదైనా అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సభలో ఆందోళన చేయడానికి, అలజడి సృష్టించడాన్ని అనుమతించను. సభ్యులు సీటులోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఇస్తా' అని స్పీకర్ పేర్కొన్నారు.

అయితే, సభ్యులు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభ వాయిదా వేయక తప్పలేదు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఎగువ సభ ఉదయం సమావేశం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను వెంటనే నియంత్రించాలని, రూపాయి మారకం విలువను తగ్గకుండా చర్యలుచేపట్టాలని, ధరాఘాత ప్రభావం నుంచి దేశప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ధరల మోతపై విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎగువసభ గురువారానికి వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles