Ranil Wickremesinghe elected president by MPs శ్రీలంక దేశాధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నిక..

Ranil wickremesinghe elected sri lanka president in parliament vote

srilanka new president 2022, srilanka new president name, sri lanka new president speech today, sri lanka president news today, sri lanka new president and prime minister, sri lanka new president 2022, sri lanka new president name 2022, ranil wickremesinghe news today, Ranil Wickeremesinghe, new president, Sri Lanka President Election, Sri Lanka Economic Crisis, Sri Lanka Politics

Six-time Prime Minister and acting President Ranil Wickremesinghe was on July 20 elected President of Sri Lanka — a post that has eluded him despite a near-half century political career — in extraordinary circumstances of a political crisis triggered by the island’s economic crash.

శ్రీలంక దేశాధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవశాలి రణిల్ విక్రమసింఘె ఎన్నిక..

Posted: 07/20/2022 03:37 PM IST
Ranil wickremesinghe elected sri lanka president in parliament vote

తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవశాలి, సీనియర్ రాజకీయ నేత రణిల్ విక్రమసింఘె(73) ఎన్నికయ్యారు. బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు. అర్థికంగా సంక్షోభం.. అప్పుల ఊభిలో కూరుకుపోయిన దేశాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవశాలి అవసరం ఉందని భావించిన మోజారిటీ సభ్యులు రణిల్ విక్రమసింఘె నాయకత్వాన్ని బలపర్చారు. శ్రీలంక దేశాధ్యక్ష బరిలో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనగా.. సుమారు 60శాతం మంది సభ్యులు విక్రమసింఘెకు మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు.

రణిల్​కు ప్రధాన ప్రత్యర్థి, శ్రీలంకలో అధికార పక్షమైన పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) నేత దులస్‌ అలహాప్పెరుమాకు 82 మంది జైకొట్టారు. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకేకు కేవలం మూడు ఓట్లు పడ్డాయి. దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడం వల్ల కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన విక్రమసింఘె.. ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి.

శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు పనిచేసిన అనుభవం రణిల్ విక్రమసింఘె సొంతం. ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన కొద్దిరోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గొటబాయ పరారీ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు సభలో మెజార్టీ సభ్యుల మద్దతుతో పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. విదేశీ మారక నిల్వలు అడుగంటి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతూ తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న దేశాన్ని ఎలాగైనా గట్టెక్కించడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. కాగా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన ప్రసంగిస్తూ.. ‘దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనం చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది అని  పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles