"Cold Tea" For CM Lands Official In Trouble సీఎంకు చల్లని చాయ్: ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులకు నోటీసులు

Cold tea substandard food served to cm shivraj singh chouhan officer lands in trouble

CM Shivraj Singh Chouhan, BJP, Khajuraho, Airport, Tea, substandard food, food inspector, show-cause letter, Rajesh Kanhua, Madhya Pradesh, Politics

During a stopover in Khajuraho, the Chief Minister of Madhya Pradesh, Shivraj Singh Chouhan, was served cold tea and inferior food by a government employee in the state. A show-cause letter was sent to a food inspector, requesting a response on the case and specifying "why not punitive action be initiated against you."

ముఖ్యమంత్రికి చల్లని చాయ్: ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులకు నోటీసులు

Posted: 07/12/2022 05:36 PM IST
Cold tea substandard food served to cm shivraj singh chouhan officer lands in trouble

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బీజేపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రస్తుతం విమర్శలను ఎదుర్కోంటోంది. సరిగ్గా రాస్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రతీ అంశం ప్రజల్లోకి చోచ్చుకుని వెళ్తుందన్న విషయం సీనియర్ నేతలకు బాగా తెలుసు. కానీ పరిస్థితులు మాత్రం అన్ని తమకు ప్రతికూలంగానే సాగుతున్నయన్న విషయం తెలిసి వారు ఎంతవరకు సర్ధుకు పోదామని భావించినా.. లోపాయికారంగా తీసుకుంటున్న చర్యలు కూడా బహిర్గతం అయ్యి వారి మెడకు చుట్టుకుంటున్నాయి.

రెండు రోజుల క్రితం రత్లాం మేయర్ ఎన్నికల బీజేపి అభ్యర్థి కాంగ్రెస్ జెండాలు వున్న ప్రజల ఇళ్లను ఫోటోలు తీయాలని, వారికి గెలిచిన తరువాత విద్యుత్, నీరు సహా ప్రజా సదుపాయాలను ఏమీ అందించకుండా చేద్దామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలైన విషయం తెలిసింది. తాజాగా స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, మధ్యప్రదేశ్ బీజేపి అధ్యక్షుడు విడి శర్మల కలసి పాల్గోన్న చిన్నపాటి సమావేశంలో కూడా రాజకీయ రచ్చకు దారితీసింది. అదెలా అంటే రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్‌ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ కావడమే ఇందుకు అజ్యంపోశాయి.

ప్రొటోకాల్‌ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు.  ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్‌లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్‌ సప్లై ఆఫీసర్‌ రాకేశ్‌ కాన్హౌ ప్రోటోకాల్‌ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్‌పూర్‌ జిల్లా రాజ్‌నగర్‌ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌(ఎస్‌డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు.

ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ ​లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్‌తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్‌ సప్లై ఆఫీసర్‌ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్‌డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles