Bikers perform 'Nagin dance' to truck's horn in Karnataka రహదారిపై యువకుల నాగిని డాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral video bikers perform nagin dance on road while grooving to truck s horn

nagin dance, bikers perform nagin dance, bikers dance to tune of trucks horn, Monsoon season, Dudhsagar waterfalls viewpoint, Karnataka-Goa border, Akole Tehsil, Ahmednagar district, Maharashtra, youngsters dancing rain, Nagina, viral video

Monsoon is one of the most cherished seasons for many. Whether it be sipping a hot cup of tea or getting drenched in the rain, this season evokes pleasant experiences for many. And in such a pleasant weather, a group of youngsters were seen grooving to the music of a truck’s horn on a rain soaked road in a video. The clip showing the youngsters’ “Nagin dance” has gone viral.

ITEMVIDEOS: రహదారిపై యువకుల నాగిని డాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 07/12/2022 04:38 PM IST
Viral video bikers perform nagin dance on road while grooving to truck s horn

పిచ్చి పీక్స్ కు వెళితే.. ఎలా ఉంటుందో ఇక్కడ ఈ యువకులు చూపించారు. తామున్నది ఓ రహదారిపైన అన్న విషయాన్ని మర్చి.. తాము ఎంత మంది ఉన్నామన్న అంచనాలో వారి పిచ్చి పీక్స్ కు వెళ్లింది. రహదారిపై నుంచి వాహనాలు వచ్చి.. జరగరానిది ఏమైనా జరుగుతే అన్న ధ్యాస కూడా లేకుండా.. వారు చేసిన విన్యాసాలు.. నెటింట్లో విమర్శలకు తావిస్తున్నాయి. ఓ వైపు వర్షం పడుతున్నా.. మిత్రులందరూ కలసి హాయిగా పర్యటనకు వెళ్తున్న జోష్ లో పూర్తిగా నిమగ్నమైన యువకులు.. నడిరోడ్డను కూడా తమ డాన్స్ స్టేజీగా మార్చేశారు.

రోడ్డుపై నాగిని డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా వారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌  మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కొందరు యువత జోష్ అంటూ కామెంట్లు పెట్టగా, మరికొందరు అనువుగాని చోట కూడా.. తామే అధికులమని అన్నట్లుగా రహదారి నడిరోడ్డుపై నాగిని డాన్స్ చేయడం.. వాహనాలు రాలేదు కాబడ్డి సరిపోయింది. అదే వాహనాలు వచ్చి ఉంటే పరిస్థితిని అంచనా వేయకుండా ఈ పిచ్చి గంతులు ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్‌ రైడర్స్‌ వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తూ నాగిని డ్యాన్స్‌ చేస్తూ హంగామా చేశారు.

ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.  వివరాల ప్రకారం.. నార్త్‌ కర్నాటకలో కొందరు బైక్‌ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ హారన్‌ మోగించాడు. ఆ హారన్‌ నాగిన్‌ డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్‌ చేసి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్‌ను సాంగ్‌ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్‌లో ట్రక్కు డ్రైవర్‌.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్‌ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles