నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే వరణుడు బీభత్సాన్ని సృష్టించాడు. అసోం రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపటడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణుడా.. కరుణించవా.? అని ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వరుణుడు పలకించగా, భూమి పులకరించింది. రైతన్న తన వ్యవసాయ పనులను ప్రారంభించాడు. అయితే వరుణుడు ఎక్కువగా ప్రేమ చాటుకున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. అయితే వరుణుడి ధాటికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. అయినా స్థానిక అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించి రోడ్లను బాగు చేయడం లేదు. దీంతో మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామస్థులు రోడ్లపై గోవా స్టైల్ బీచ్ పార్టీ ఏర్పాటు చేశారు.? ఏంటది.. రోడ్లపై బీచ్ పార్టీనా.. అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్కడి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజలు తెలిపిన వెరైటీ నిరసన. గుంతలమయమైన రోడ్లను గ్రామస్తులు గోవా బీచ్‌గా మార్చేశారు. అందులో కుర్చీలేసుకొని పార్టీ చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వారు నెట్టింట్లో పోస్టు చేశారు. అంతే అవి కాస్తా వైరల్‌గా మారింది. ప్రభుత్వానికి ఇలా కూడా నిరసనలు తెలుపవచ్చా.? అన్నట్లుగా ఇవి వైరల్ అయ్యాయి. ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ గ్రామంలో చిత్రీకరించారు. వర్షంధాటికి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అందులో కొందరు గ్రామస్తులు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. గోవా స్టైల్లో టీ-షర్టులు, టోపీలు, కళ్లజోళ్లతో కనిపించారు. కొందరు మ్యూజిక్ వింటూ కనిపించగా, మరికొందరు చేతుల్లో లిక్కర్ బాటిల్స్ పట్టుకుని ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ పార్టీ చేసుకున్నారు. పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
अगर आप ज़िंदादिल हैं तो आपको ईश्वर के अलावा कोई कष्ट नहीं दे सकता। नगर निगम या सरकार को कोसना छोड़िए। अपनी पॉज़िटिवीटी के ‘बीच’ जीवन का आनंद लीजिए।
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 4, 2022
सड़क के गड्ढे को बीच बनाने की ये प्रतिभा मध्य प्रदेश के लोगों ने दिखाई है।
pic.twitter.com/nuYAGMZsz9
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more