Telugu film shoots halted, industry received strike notice సినీకార్మికుల ఆందోళనలో.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ దిగ్భంధం

Workers strike demanding better wages brings telugu film industry to a grinding halt

telugu film industry strike, Film Federation, tollywood workers strike, tollywood workers Protest, Telugu cine workers, telugu film industry, cine-workers strike, Telugu cine workers, Strike, low salaries, Film Federation, tollywood celebrities, tollywood workers Protest, Telugu film industry, telangana, hyderabad, telangana

At least 20,000 workers of the Telugu film industry, also known as Tollywood, demanding better wages abstained from work Wednesday affecting the shooting schedules of at least a dozen films. The cinema workers have at least 10 different associations and unions and all of them have joined the strike. The workers gathered at Krishna Nagar in Hyderabad to stage a protest outside the Telugu Film Industry Federation in the morning.

సినీకార్మికుల ఆందోళనలో.. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం దిగ్భంధం

Posted: 06/22/2022 02:59 PM IST
Workers strike demanding better wages brings telugu film industry to a grinding halt

కరోనా మహమ్మారి లాంటి కంటికి కనబడని శత్రువులు ప్రభావం చూపినా.. తాము అర్థాకలితో అలమటించామే తప్ప.. ఎన్నడూ నిరసన బాటపట్టని తెలుగు సినీపరిశ్రమకు చెందిన కార్మికులు. ఇవాళ మాత్రం తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ లకు బంద్ ప్రకటించి మరీ తమకు వెతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవస్థలు వచ్చినా, కష్టాలు చుట్టుముట్టినా తాము నమ్ముకున్న చిత్రపరిశ్రమలోనే మనగలుగుతున్నామని, అయితే ఇదే అదనుగా భావించిన సినీ ఫెడరేషన్ పెద్దలు తాము నాలుగేళ్లుగా విన్నవిస్తున్నా తమ డిమాండ్లను పెడచెవిన పెట్టాయని, దీంతోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగూణంగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సినీ కార్మికులు కదంతొక్కారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయాన్ని దిగ్భంధించారు. సినీ పరిశ్రమలోని పలు యూనియన్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఫిలిం చాంబర్‌ చేరుకుని నిరసన తెలిపారు. ఇందులో భాగంగా సినీ కార్మికులెవరకు షూటింగ్‌లో పాల్గొనలేదు. అంతేకాదు జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకువెళ్లే బస్సులను సైతం ఫెడరేషన్‌ సభ్యులు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.

నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని.. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు చెప్పారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. పిల్లల స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే సమయంలో అటు ప్రభుత్వం కూడా స్పందించింది. సినీకార్మికులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని అల్టిమేటం జారీ చేసింది.

కాగా వేతనాల పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు ఫిల్మ్‌ చాంబర్‌, నిర్మాత మండలిని హెచ్చరించారు. అంతేకానీ సమ్మెబాట పడతామని ఎక్కడ చేప్పలేదని నిర్మాతల మండలి తెలిపింది. అయినా సమ్మెకు ఉపక్రమించాలంటే కనీసం పక్షం రోజుల ముందే కార్మికసంఘాలు తమకు నోటీసుల ఇవ్వాలని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థాంతరంగా సమ్మెకు దిగుతామని ప్రకటించడం సముచితం కాదని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కామర్స్‌ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫడరేషన్‌ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని తెలిపారు.

ఇదిలావుంటే రామకృష్ణ వ్యాఖ్యలను సినిమా కార్మికుల ఫెడరేషన్‌ ఖండిచింది. ఈ నెల 6వ తేదినే చాంబర్‌కు సమాచారం ఇచ్చామని.. అందుకు సంబంధించిన లేఖను మీడియాకు అందించారు. అందులో ఈ నెల 6వ దానిని ధృవీకరిస్తూ ఫిలిం చాంబర్‌కు లేఖ రాసినట్టుగా ఉంది. అంతేకాదు దానిని చాంబర్‌ స్వీకరించినట్లు కూడా ఉండటం గమనార్హం. వేతన సవరణ గుడువు కాలం పూర్తయి 13 నెలలు దాటిందని, వెంటనే వేతనాలను సవరించకపోతే 15 రోజుల తర్వాత కార్మికులు ఎవ్వరూ షూటింగ్స్‌ హజరు కాకుడదనే నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. అలాగే వెంటనే వేతన విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కూడా ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ స్పష్టం లేఖలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh