Hizbul top terrorist arrested in Kashmir హిజ్బుల్ ముజాహిదీన్‌ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ అరెస్టు

Hizbul top terrorist arrested ied mobile phone recovered during search ops

Jammu and Kashmir terrorist caught, Hizbul Mujaheddin top commander arrested, Talib Hussain Gujjar arrested, Hijbul commander Talib Hussain arrested in Kishtwar, Army, Kashmir, Hizbul Mujaheddin, top commander, Talib Hussain Gujjar, Kishtwar, Army, Kashmir, Doda Police, CRPF, Jammu and Kashmir, Crime

In a major setback to Hizbul Mujahiddin terror outfit in Kishtwar district of Jammu and Kashmir, police along with 17 RR manage to arrest Talib Hussain Gujjar, son of Noor Mohammad, Resident of Rashgwari Padyarna in Nagsini Tehsil of Kishtwar. Talib was trying to leave the jurisdiction of Kishtwar with a changed identity.

హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. భద్రతా బలగాలకు చిక్కిన టాప్ కమాండర్

Posted: 06/06/2022 03:59 PM IST
Hizbul top terrorist arrested ied mobile phone recovered during search ops

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ గుజ్జర్ భారత భద్రతా బలగాలకు చిక్కాడు. కాశ్మీర్ లోయలో అశాంతిని రగిల్చేందుకు కొత్తగా ఆర్మీ రిక్రూట్ మెంట్ కు పాల్పడుతూ.. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న తాలిబ్ హుస్సేన్ ను ఇవాళ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), రాష్ట్రీయ రైఫిల్స్ దళాలకు చిక్కాడు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లోని నాగ్సినీ తహశీల్ రష్గ్వాన్ మధ్యమలోని ఓ ఇంట్లో తలదాచుకుంటున్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

భారత భద్రతా దళాలు తన కోసం అన్వేషిస్తున్నాయన్న సమాచారం అందుకున్న గుజ్జర్.. తన పేరును మార్చుకుని.. నాగ్సినీ తహశీల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కాశ్మీర్ లోయలో హింసను ప్రేరేపించేందుకు ఉగ్రవాదంలోకి చేరికలను నిర్వహిస్తున్న ఆయన పెద్ద అలజడి సృష్టించేందుకు కూడా పథక రచన చేస్తున్నాడు. ఈ క్రమంలో భద్రతాదళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో గుజ్జర్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న బలగాలు 17 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ కలిసి గాలింపు చర్యలు చేపట్టాయి. గుజ్జర్ స్థావరాలపై దాడులు చేసి అతడిని సజీవంగా పట్టుకున్నాయి.

అతడిని సజీవంగా పట్టుకోగలిగామని, ఇది నిజంగా గొప్ప విజయమని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఉగ్రవాది జహంగిర్‌ సరూరి అలియాస్‌ మొహమ్మద్‌ అమీన్‌ భట్‌కు గుజ్జర్‌ అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో అతడి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, భట్‌, గుజ్జర్ ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు కలిసే ఉన్నారు. లోయలో పలు ఉగ్రదాడులకు పాల్పడిన గుజ్జర్ కోసం కొన్నేళ్లగా గాలిస్తున్న బలగాలు ఎట్టకేలకు అతడిని పట్టుకోగలిగాయి. తాలిబ్ గుజ్జర్ కు కిష్త్వార్ జిల్లాలోని నాగ్సిని, మార్వా, దచ్చన్, పాడర్ ప్రాంతంలోని స్థానిక కొండ మార్గాల గురించి తెలియడంతోనే అతను తప్పించుకు తిరుగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles