ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడ్డారు. ఓ ప్రార్థనా మందిరంపై తుపాకీ కాల్పులు, బాంబులతో మారణహోమం సృష్టించారు. ఈ ఉగ్రదాడిలో 50 మందికి పైగా భక్తుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. అనేకమంది భక్తలు తీవ్రగాయాలపాలపై అసుపత్రులలో చికిత్స పోందుతున్నారు. నైజీరియాలోని ఓండోలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ప్రార్థనల కోసం స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరానికి తరలిరావడంతో ఎక్కువమంది ఈ కాల్పుల్లో హతులయ్యారు. మృతుల్లో చిన్నారులే అధికంగా వున్నారని తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.
ఆదివారం స్థానికులు పెద్ద సంఖ్యలో చర్చిలోనికి వచ్చి ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముష్కరులు ఒక్కాసారిగా దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది మరణించారని స్థానిక శాసనసభ్యుడు ఒలువోల్ వెల్లడించారు. భక్తుల ప్రార్థనలు మిన్నంటిని భక్తిపారవశ్యంలో మునిగి తేలాల్సిన చోట.. ఈ మారణకాండతో హాహాకారాలు, అర్థనాధాలు.. చర్చిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా మారింది. అధికారికంగా మృతుల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించనప్పటికీ 50 మందికి పైగానే మృత్యువాత పడ్డారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు.
చర్చి పాధర్ ను కూడా ముష్కరులు అపహరించుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రమే గర్భం దాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని మండిపడ్డారు. ఏది ఏమైనా, ఈ దేశం ఎప్పటికీ దుష్టులకు లొంగదని తేల్చి చెప్పారు. చీకటి ఎప్పటికీ కాంతిని పారదోలలేదని అన్నారు. చివరికి నైజీరియానే గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more