Ex- minister’s family members get anticipatory bail ఈ నెల 18కి వరకు మాజీమంత్రి ఫ్యామిలీకి హైకోర్టులో స్వల్ప ఊరట

Ap class 10 paper leak case ex tdp minister s family members get anticipatory bailq

Narayana, High court, Andhra high court, Ponguru narayana, P Narayana, Narayan group, Class 10, Paper leak, Paper leak case, Narayana Educational Institutions, Class 10 Paper leak case, anticipatory bail, Narayana Family members, Justice K Manmadha Rao, Chittoor police, Andhra Pradesh, Crime

The Andhra Pradesh High Court has granted anticipatory bail to the daughters and son-in-law of former minister Ponguru Narayana and some others in the Class 10 question paper leak case. Narayana's daughters P Sharani and P Sindhura, son-in-law K Punith and 10 others of the Narayana Group of Educational Institutions got anticipatory bail.

‘ఈ నెల 18 వరకు వారి జోలికెళ్లకండీ’: పోలీసులకు హైకోర్టు అదేశాలు

Posted: 05/16/2022 11:27 AM IST
Ap class 10 paper leak case ex tdp minister s family members get anticipatory bailq

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వారు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు నిన్న ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ 2014లోనే తప్పుకున్నట్టు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు చూపించడంతో అదే రోజు ఆయనకు బెయిలు మంజూరైంది. దీంతో నారాయణ కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నధమయ్యారు.  

దీంతో ఈ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ కుటుంబ సభ్యులతో పాటు విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, సురేశ్‌కుమార్‌, ఎ.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు మాల్ ప్రాక్టీస్‌తో సంబంధం లేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని పేర్కోన్నారు,

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వారి తరపు న్యాయవాది అభ్యర్థించారు. పోలీసుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. స్పందించిన న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 18 (బుధవారం) వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles