"No One Can Be Forced To Get Vaccinated": SC ‘‘వాక్సీన్ వేసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయోద్దు’’

No individual should be forced to get vaccinated against covid supreme court

covid vaccination, coronavirus vaccine, vaccination in Inida, covid vaccines, corona vaccine, covid jab, supreme court

The Supreme Court of India on Monday said that no individual should be forced to get a Covid vaccine shot. It said that conditions imposed by some state governments, restricting access of unvaccinated people to public places is not proportional and should be recalled in the present prevailing conditions.

కరోనా వాక్సీన్ వేసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయోద్దు: ‘సుప్రీం’

Posted: 05/02/2022 04:25 PM IST
No individual should be forced to get vaccinated against covid supreme court

కోవిడ్ టీకా వేసుకోవాల‌ని దేశంలోని ప్రజలెవరినీ ఒత్తిడి చేయ‌వ‌ద్దు అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. దేశంలో కరోనా రెండో దశకు ముందు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వాక్సీన్ వేసుకోవడంపై దేశప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. ఈ నేపథ్యంలో రెండో దశలో కరోనా తీవ్ర లక్షణాలతో విజృంభించడం.. ఆక్సిజన్ అందక అనేకులు అసువులు బాసారు. ఈ తరుణంలో కోవిడ్ టీకాలు తీసుకునేందుకు దేశప్రజలు పోటీపడ్డారు. దీంతో డిమాండ్ కు తగు సంఖ్యలో వాక్సీన్ కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఏకంగా కొన్ని రోజుల పాటు వాక్సీన్ ఇవ్వడం కూడా నిలిపివేశారు.

ఆ తరువాత దేశంలోని ప్రతీ ఒక్కరు వాక్సీన్ తీసుకోవలన్న అదేశాలతో హర్ గర్ దస్తక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. దీంతో దేశప్రజల్లో దాదాపుగా అందరూ టీకాలు తీసుకున్నారు. అయితే కొందరు మాత్రం వాక్సీన్ కు భయపడి చెట్లు ఎక్కడం, నదిలోకి వెళ్లడం లాంటి చర్యలు చేపట్టారు. ఇలాంటి వారికి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. ఇకపై వాక్సీన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరినీ ఒత్తిని చేయవద్దని కేంద్ర కుటుంబ అరోగ్యశాఖ అధికారులను అదేశించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ విధానం అసంబ‌ద్ధంగా ఉంద‌ని అన‌లేమ‌ని సుప్రీం తెలిపింది.

కోవిడ్‌19 వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల గురించి కేంద్రం డేటాను రిలీజ్ చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన ఆంక్ష‌ల‌ను కోర్టు త‌ప్పుప‌ట్టింది. వ్యాక్సిన్ వేసుకోని వారిని ప‌బ్లిక్ ప్ర‌దేశాల‌కు రానివ్వ‌క‌పోవ‌డం స‌రిగా లేద‌ని కోర్టు తెలిపింది. అలాంటి నిర్ణ‌యాలు తీసుకున్న ప్ర‌భుత్వాలు వెంట‌నే వాటిని ఎత్తివేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు కోరింది. వ్యాక్సినేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వం ఓ విధానాన్ని రూపొందించి, ప్ర‌జా సంక్షేమం కోసం కొన్ని ష‌ర‌తుల‌ను అమ‌లు చేయాల‌ని కోర్టు త‌న తీర్పులో చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles