Woman's Revenge on Ex Blows Up in Her Face ప్రియుడి కారుకు నిప్పు.. తృటిలో తప్పించుకున్న ప్రియురాలు

On cam woman sets car on fire nearly gets burnt herself

dallas woman revenge on boyfriend, woman revenge on boyfriend car, woman sets boyfriends car on fire, woman revenge on boyfreind car, woman sets ex-boyfriend car on fire, Dallas, Social media, Viral Video, car on fire, woman burns car, north Texas, America, Crime

A video viral on social media shows a woman setting a car on fire. It is being reported that the car allegedly belonged to the woman's ex-boyfriend and the incident reportedly happened in Dallas, US. In the video, the woman can be seen pouring gasoline inside the car after breaking one of the windows. She then set the car on fire but in the process nearly got burnt herself.

ITEMVIDEOS: ప్రియురాలి ప్రతీకారం ఎదరుతిరిగింది: ప్రియుడి కారుకు నిప్పు.. అంతలో..

Posted: 04/29/2022 12:39 PM IST
On cam woman sets car on fire nearly gets burnt herself

ఇష్టమైన వ్యక్తులపై ఒక్కోపర్యాయం మనం చూపించే అవితమైన ప్రేమానురాగాలు అవతలి వారికి ఇబ్బందికరంగానూ ఉండవచ్చు. ఇక జీవితాంతం ఈ ఇబ్భందులను భరించాల్సి ఉందా అన్న అనుమానాలతో వారు అందోళన చెందవచ్చు. ఈ ఆందోళన వారు విపరీత నిర్ణయాలకు కూడా కారణం కావచ్చు. ఇక కొత్త జంటల మధ్య ఈ అవగాహనా రాహిత్యాన్ని మరింత పెంచింది కరోనా లాక్ డౌన్. భార్యభర్తలు, పిల్లులు, అందరూ ఇళ్లలోనే బంధీలను చేసిన లాక్ డౌన్.. కనీసం ఇష్టమైన ఆహారాన్ని కూడా తిననివ్వకుండా చేసింది. అంటే ఇంట్లో తయారు చేసుకోలేని రుచికరమైన స్నాక్స్.. వగైరాలను దూరం చేసింది. ఇంటి భోజనమే శ్రేష్ఠకరమైన బోజనమని చాటింది.

ఇదిలావుంచితే ఈ కరోనాకు ముందుకు బ్రేక్ అప్ తీసుకున్న ఓ జంటను మాత్రం లాక్ డౌన్ మరింత క్షోభ పెట్టింది. మరీ ముఖ్యంగా ప్రియురాలిని మాత్రం తన మాజీ ప్రియుడిపై అసూయతో రగిలిపోయేలా చేసింది. కారణాలు తెలియదు కానీ ఎందుకనో విడిపోయిన ఈ జంటలోని ప్రియురాలు మాత్రం అసూయతో రగిలిపోయేలా చేసింది. అంతే లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత అమె ఏకంగా తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేలా చేసింది. అయితే ఈ ప్రయత్నంలో అమె మరణం అంచుల వరకు వెళ్లాల్సివచ్చింది. ఔనా.. ప్రతీకారం ఎదుటివారిపై తీర్చుకున్నా.. ఇలా జరుగుతుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.?

ఆ వివరాల్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ జంట కరోనా తొలిదశ ప్రపంచవ్యాప్తంగా విజృంభించే క్రమంలో విడిపోయింది. ఆ వెంటనే లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రియుడిపై ప్రియురాలు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అంతే ఒక డబ్బాలో పెట్రోల్ నింపుకుని అగ్గిపెట్ట పట్టుకుని ప్రియుడి కారు పార్క్  చేసిన ప్రాంతానికి వెళ్లిందీ యువతి. అక్కడ ప్రియుడి కారును చూడగానే కిటికీ అద్దాలను ధ్వంసం చేసి కారు లోపలి సీట్లపై పెట్రోల్ పోసింది. ఇక నిప్పు పెట్టేందుకు అగ్గిపుల్ల గీసి అద్దాలోంచి కారులోపలికి ముఖం పెట్టి నిప్పు పెట్టింది.

ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున అంటుకోవడంతో అమె ముఖంపై కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కిటికీలోంచి తలను భయటకు తీసినా.. అగ్గికీలల వ్యాప్తి వేగానికి అమె తట్టుకోలేక కిందపడింది. ఆమె ముఖానికి మంటల సెగ తగిలినంతగానే అమె వేగంగా తల తీసినా మంటలు కూడా బయటకు వచ్చాయి. దీంతో అమె మరోకారుపైకి ఎగిరి.. కిందపడింది. ఆ తరువాత మోకాళ్లు, చేతులపై కాసింత దూరం నడుచుకుంటూ కొంత దూరం వెళ్లింది. ఆతరువాత వెంటనే వెనక్కు వచ్చి పెట్రోల్ డబ్బాతో పాటు ఇతర వస్తువులను తీసుకుని జారుకుంది. ఈ ఘటన ఉత్తర్ టెక్సాస్ ప్రాంతంలోని వాణిజ్య నగరమైన డల్లాస్ లో జరిగింది. సరిగ్గా జూలై 2020లో చోటుచేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh