It’s official: Elon Musk acquires Twitter for $44 billion ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. కుదిరిన డీల్

Twitter confirms sale of company to elon musk for 44 billion

Elon Musk, Twitter, Elon Musk Twitter, elon musk to buy twitter, is elon musk buying twitter, Elon Musk Twitter Saga, Elon Musk, Parag Agrawal, Elon Musk, Elon Musk buys Twitter, Twitter Elon Musk, Elon Musk Twitter deal, Elon Musk is now Twitter owner, Elon Musk Twitter, Elon Musk Twitter acquisition, Musk Twitter, Musk Twitter deal

In a mega-deal, billionaire Elon Musk has now officially bought the social site, Twitter. Musk has acquired the platform for approximately $44 billion with shares valued at $54.20. Tesla CEO had announced his bid for Twitter on April 14, calling it his ‘best and final offer’.

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. 44 బిలియన్ డాలర్లతో భారీ డీల్

Posted: 04/26/2022 06:12 PM IST
Twitter confirms sale of company to elon musk for 44 billion

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థల ఖాతాలోకి చేరిపోయింది. రెండు వారాల క్రితం ట్విట్టర్‌లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మస్క్ ప్రతిపాదనలకు ట్విట్టర్ బోర్డు అంగీకారం తెలిపింది. 44 బిలియన్లుకు డీల్ కుదిరినట్లు ప్రకటన వెలువడింది. కాగా ట్విట్టర్ -ఎలాన్ మస్క్ మధ్య ఈ క్యాష్ డీల్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మస్క్ 36 శాతం అదనంగా చెల్లించారు.

ఈ డీల్ లో భాగంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‍కు 54.2 డాలర్లను చెల్లించనున్నారు. ట్విట్టర్‌లో తనకు 9.2 శాతం వాటా ఉందని మస్క్ ప్రకటించినప్పుడు ఉన్న ట్విట్టర్ షేర్ ధర కంటే ఇది 36శాతం అధికం. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు మస్క్. తాజాగా కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. దీంతో ట్విట్టర్ హస్తగతం చేసుకోవాలన్న ఆసక్తి నేపథ్యంలో మస్క్ ఏకంగా 36శాతం మేర అదనంగా చెల్లింపులు చేపట్టాల్సి వచ్చింది. ట్విట్టర్ తన ఆఫర్‌ను అంగీకరించాక ఎలాన్ మస్క్ ఓ ప్రకటన చేశారు.

భావ ప్రకటన స్వేచ్ఛ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి… భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో అది చాలా ముఖ్యమని, భవిష్యత్తులో దీని ప్రాధాన్యత చాలా ఉంటుందని మస్క్ రాసుకొచ్చారు. ట్విట్టర్‌ కు అపారమైన శక్తి ఉందని, కంపెనీతో కలిసి పని చేసేందుకు ముందుంటానని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ అన్నారు. ట్విట్టర్ తో ఎంతో ప్రయోజనం ఉందని.. దీనికి చాలా ఔచిత్యం ఉందన్న ఆయన.. ఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తమ టీమ్ స‌భ్యుల‌ ప‌ట్ల‌ చాలా గర్వంగా ఉందన్నారు.

గత కొంతకాలంగా.. ట్విట్టర్​పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్​. ట్విట్టర్​లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్​తో ట్విట్టర్​ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్​ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్​ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్​కు షాక్​ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్​ను ముందుకు తీసుకురావటం.. తాజాగా డీల్ ఓకే కావటం చకచకగా జరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles