రైలు మీద నుంచి వెళ్లి ప్రాణాలతో బయటపడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? షాక్ తో కొంతసేపటి వరకు తేరుకోలేరు. కానీ, ఈ యువతి అలా కాదు. ఆమెపై నుంచి గూడ్సు రైలు వెళ్లిపోగా, క్షేమంగా బయటపడింది. రైలు వెళ్లిన వెంటనే ఆ యువతి కంగారుగా పైకి వచ్చేయలేదు. లేచి పట్టాలపైనే కూర్చుని సెల్ ఫోన్ తీసి కాల్ మాట్లాడుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విట్టర్ లో ఈ నెల 12న పోస్ట్ చేశారు. ఇప్పటికే దీన్ని లక్ష మంది చూశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలను పేర్కొనలేదు.
‘ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం ఎంతో ముఖ్యం’’ అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. పట్టాల నుంచి నింపాదిగా స్టేషన్ లోకి వచ్చిన యువతి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీన్ని ఎవరో కానీ, చక్కగా వీడియో తీసి పది మందికి జాగ్రత్తలపై స్పృహ కలిగేలా చొరవ చూపారు. ‘అదృష్టంతో ఆమె శరీర భాగాలు ఏవీ రైలుకు తాకలేదు. లేదంటే ముక్కలయ్యేది’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ఆ యువతిని అరెస్ట్ చేయాలని కోరుతూ కొందరు ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు
फ़ोन पर gossip, ज़्यादा ज़रूरी है pic.twitter.com/H4ejmzyVak
— Dipanshu Kabra (@ipskabra) April 12, 2022
(And get your daily news straight to your inbox)
Jun 28 | అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్‌గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది. ముంబై... Read more
Jun 28 | హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. నగరవాసులు అవసరం అయితే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షాలు... Read more
Jun 28 | తిరుమల శ్రీవారి భద్రతకు అత్యాధిునికంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమలకు కరోనా మహమ్మారి తరువాత భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో అటు భక్తులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు భద్రత... Read more
Jun 28 | మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో... Read more
Jun 28 | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ... Read more