Gorakhpur: Armed assailant arrested after attacking cops వేట కొడవళితో పోలీసులపై దాడి చేసిన ఐఐటీయన్..

Iit graduate attacks 2 cops with dagger outside gorakhnath temple in up

gorakhpur temple attack, gorakhpur temple, constables attacked gorakhpur temple, police attacked gorakhpur temple, gorakhpur temple murtaza, Ahmed Murtaza, Ahmed Murtaza gorakhpur temple, yogi adityanath, gorakhpur temple news, Uttar Pradesh news, Crime

The Uttar Pradesh Police has said that Ahmed Murtaza, the 29-year-old man who allegedly injured two Provincial Armed Constabulary jawans with a sharp-edged weapon and tried to forcibly enter the Gorakhnath temple on Sunday night, is a chemical engineering graduate from the Indian Institute of Technology (IIT) Bombay.

వేట కొడవళితో పోలీసులపై దాడి చేసిన ఐఐటీయన్..

Posted: 04/04/2022 08:28 PM IST
Iit graduate attacks 2 cops with dagger outside gorakhnath temple in up

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో భయభ్రాంతులకు గురిచేసే సంఘటన జరిగింది. ఇక్కడి గోరఖ్ నాథ్ పుణ్యక్షేత్రం వద్ద ఓ ఐఐటీ పట్టభద్రుడు వేట కొడవలితో పోలీసుల వెంటపడడం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడి పేరు అహ్మద్ ముర్తజా అబ్బాసి. అతడి స్వస్థలం గోరఖ్ పూర్. అతడు 2015లో ప్రతిష్ఠాత్మక ఐఐటీ-బాంబే నుంచి పట్టా పుచ్చుకున్నాడు. కాగా, గోరఖ్ నాథ్ ఆలయం వద్ద మతపరమైన నినాదాలు చేస్తూ అలజడి సృష్టించాడు. ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు అతడిని అడ్డుకోబోయారు.

దాంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఐఐటీ గ్రాడ్యుయేట్ పదునైన ఆయుధాన్ని బయటికి తీసి పోలీసులపైకి ఉరికాడు. దాంతో పోలీసులు పరుగులు తీశారు. దాంతో, అక్కడి దుకాణదారులు, స్థానికులు ఆ యువకుడిపైకి రాళ్లు విసిరారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకోగలిగారు. అతడి నుంచి ఓ ల్యాప్ టాప్, ఫోన్, ఓ టికెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను బట్టి చూస్తే, దీని వెనుక భారీ ఉగ్ర కుట్ర ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు అభిప్రాయపడ్డారు.

అతడిపై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన గోరఖ్ నాథ్ ఆలయానికి ప్రధాన పూజారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కావడం గమనార్హం. కాగా, ఐఐటీ గ్రాడ్యుయేట్ అహ్మద్ ముర్తజా అబ్బాసి దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారికి బీఆర్డీ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిద్దరినీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రిలో పరామర్శించారు. అటు, ఆ యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. అతడి చేయి విరిగినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles