Old woman transfers all her property in Rahul Gandhi రాహుల్ గాంధీకి తన ఆస్తిని చెందేలా మహిళ వీలునామా.!

Country needs him 78 year old woman transfers all her property in rahul gandhi s name

dehradun woman gives property to rahul gandhi, rahul gandhi legal heir of old woman property, 78 year old woman congress leader, old woman gives property to rahul gandhi, country needs rahul gandhi, old woman inspired by rahul gandhi thourghts, uttarakhand congress, assets to rahul gandhi, Pushpa Munjial, Rahul Gandhi, Congress, Country, influence, thoughts, assets, Court, Dehradun, Uttarakhand, Politics

A 78-year-old woman from Uttarakhand's Dehradun has named all her property after Congress leader Rahul Gandhi, including assets worth 50 lakhs and 10 tola of gold. Pushpa Munjial has presented a will in the Dehradun court, giving the ownership title of her properties to Rahul Gandhi. Pushpa Munjial described Rahul Gandhi and his ideas as necessary for the country. She said she is very much influenced by the thoughts of Rahul Gandhi and that is why she is giving her property to him.

‘‘దేశానికి రాహుల్ కావాలి’’: అగ్రనేతకు ఆస్తిని రాసిచ్చిన వృద్దమహిళ.!

Posted: 04/04/2022 09:21 PM IST
Country needs him 78 year old woman transfers all her property in rahul gandhi s name

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన ఆస్తినంతా రాసిచ్చింది ఉత్తరాఖండ్​ రాజధాని డెహ్రాడూన్​కి చెందిన ఓ మహిళ. తన తదనంతరం రాహుల్ కు ఆస్తి దక్కేలా వీలునామాను కోర్టుకు సమర్పించింది. తన ఆస్తికి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని వారసుడిగా రాసిచ్చింది 78 ఏళ్ల వృద్దమహిళ. నగరంలోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్​ కుమార్తె పుష్ప మంజీలాల్​ తన పేరుపై ఉన్న మొత్తం ఆస్తులను రాహుల్​ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీలునామా పత్రాలను కోర్టులో సమర్పించింది. రాహుల్​ గాంధీ ఆలోచనలు తనను బాగా ప్రభావితం చేశాయని.. ప్రస్తుతం దేశానికి రాహుల్ గాంధీ లాంటి నేతల అవసరం చాలా ఉందని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి నేటి వరకు గాంధీ కుంటుంబం దేశం కోసం అత్యున్నత త్యాగాలను చేసిందని తెలిపింది. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆలోచనలతో ప్రభావితమయ్యే తన ఆస్తికి వారసుడిగా ఎంపికచేసినట్లు మహిళ తెలిపింది. ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు సహా ఇతర పత్రాలను కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్​సింగ్​కు అందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. తన తదనంతరం ఆస్తి మొత్తాన్ని రాహుల్ గాంధీకి అప్పగించాలని పుష్ప.. కోర్టును అభ్యర్థించింది.

పుష్ఫ మంజీలాల్ తన పేరుపై రూ.50 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​లు, 10 తులాలల బంగారం ఉన్నట్లు సమాచారం. స్వతంత్రా భారతావనిలో పేదల కోసం అలోచించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని, దేశంలోని పేదలు రెండు పూటలా అన్నం తినేలా ఆహారభద్రతా పథకాన్ని తీసుకువచ్చింది కూడా అదే పార్టీ అని అమె పేర్కోన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్​ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా ఉండగా.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushpa Munjial  Rahul Gandhi  Congress  Country  influence  thoughts  assets  Court  Dehradun  Uttarakhand  Politics  

Other Articles