SC panel recommends canceling bail plea of Ashish Mishra అశీష్ మిశ్రా బెయిల్ రద్దుకు సుప్రీం ఫ్యానెల్ సిఫార్సు

Sc directs uttar pradesh to respond to sit reports seeking cancellation of bail to ashish mishra

Lakhimpur kheri, ashish mishra, lakhimpur kheri, qLakhimpur case, Supreme Court, Farmers Protest, SC pannel, Uttar Pradesh govt, Ashish Mishra, Ajay Mishra, SC on Lakhimpur case, lakhimpur violence, UP govt, UP govt supreme court, Ashish Mishra, Union Minister, Uttar Pradesh, crime

The Supreme Court sought Uttar Pradesh government’s response on a plea seeking cancellation of bail granted to Ashish Mishra, accused in the Lakhimpur Kheri violence case, and pointed out that the judge monitoring the investigation had favoured filing an appeal for this. Ashish is son of Union minister Ajay Mishra.

లఖీంపూర్ ఖేరీ ఘటనలో అశీష్ మిశ్రా బెయిల్ రద్దుకు సుప్రీం ఫ్యానెల్ సిఫార్సు

Posted: 03/30/2022 06:50 PM IST
Sc directs uttar pradesh to respond to sit reports seeking cancellation of bail to ashish mishra

లఖింపూర్‌ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ బెయిల్‌ రద్దును సవాల్‌ చేస్తూ సిఫారసు చేసింది. అయితే, సిట్‌ సూచన మేరకు ఆశిష్‌ బెయిల్‌ రద్దుకు యూపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఎందుకు సవాల్‌ చేయలేదో సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది.

ఈ మేరకు కేసు విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. అలహాబాద్‌ కోర్టు ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేయగా.. బెయిల్‌ను బాధిత కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై అప్పీల్‌ చేయాలని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ కమిటీ యూపీ ప్రభుత్వానికి సూచించిందని, ప్రతిపాదనలతో కూడిన నివేదికతో సిట్‌.. యూపీ అదనపు చీఫ్‌ సెక్రటరీ(హోం)కి రెండు లేఖలు పంపితే.. ఎందుకు అప్పిల్‌ చేయలేదని ప్రశ్నించగా.. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పందిస్తూ.. అదనపు చీఫ్‌ సెక్రెటరీకి ఎలాంటి లేఖలు అందలేదని తెలిపారు. దీంతో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ.. సిట్‌ నివేదిక కాపీలను పరిశీలించాలని ఆదేశించింది. నివేదికపై ఏప్రిల్‌ 4వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలంటూ.. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇంతకు ముందు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles