New SUPER ID linked with Aadhaar, PAN, driving licence, passport భారతీయులందరికీ ఆధార్ తరహా డిజిటిల్ ఐడీ..

New super id in india to link your aadhaar card pan driving licence passport coming

Aadhaar, PAN, driving licence, passport, PAN and Aadhaar to driving licence and passport numbers, Aadhaar Card, Pan card, Federal Digital Identity, Digital ID, Federal ID, Central government, MeitY, Ministry of Electronics and Information Technology’s

The Central government is working on a new model of Federated Digital Identity, a successor of the Aadhaar Card that will link multiple digital IDs such as Aadhaar, PAN, driving licence, passport, and others into one ID. According to the Ministry of Electronics and Information Technology’s (MeitY), the new digital ID will be present in the form of a unique ID, similar to the Aadhaar card number.

భారతీయులందరికీ ఆధార్ తరహా సూపర్ డిజిటల్ ఐడీ.. ప్రజాభిప్రాయ సేకరణలో కేంద్రం..

Posted: 01/31/2022 11:32 AM IST
New super id in india to link your aadhaar card pan driving licence passport coming

దేశప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త సూపర్ ఐడెంటినీని అందించే యోచనలో ఉంది. ఈ సూపర్ ఐడీ పూర్తిగా డిజిటల్ ఐడీగా మారనుంది. ఒక్కోక్కో పౌరుడికి ఒక్కో ఐడీని అందించనున్న కేంద్రం.. అందులో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు నుంచి డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు వరకు అన్నింటినీ అనుసంధానం చేసుకునే సౌలభ్యంతో పాటు వాటిని అక్కడే సేవ్ చేసుకునే అవకాశాన్ని కూడా అందించనుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో దేశపౌరులు తమ ఐడీ కార్డులుగా వినియోగిస్తున్న అన్నింటినీ ఇక్కడ జతపర్చుకోవచ్చు. దీంతో ఇన్నాళ్లు ఆధార్ నెంబరు, ఫ్యాన్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్సు నెంబరుతో పాటు అన్ని నెంబర్లును గుర్తుంచుకోవడంతో పాటు కార్డులను కూడా లేదా వాటి ప్రతులను జేబులో పోందుపర్చుకోవాల్సిన అవసరం వచ్చేది.

అయితే ప్రజలు ఇలా నాలుగైదు ఐడీలను గుర్తుంచుకోవడంతో పాటు వాటిని నిత్యం జేబులో పెట్టుకుని తిరుగాల్సి వస్తుందన్న అంశమై దృష్టిసారించిన కేంద్రం కొత్తగా డిజీటల్ ఐడీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ఒక రకంగా డిజిటల్ లాకర్ తరహాలోనూ అందుబాటులోకి రానుంది. అన్ని ఐడెంటిలను కలిపి ఒకే డిజిటల్ ఐడీగా రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ (డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం)గా ఓ కొత్త మోడల్‌ కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ కార్డులన్నీ జతకట్టి ఒక్కటిగా చేసిన తర్వాత కూడా ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయిస్తారు.

ఇదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును వాడుకునేలా డిజిటల్ ఐడీని రూపోందించనున్నారు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ఐడీలన్నీ ఒకే చోట ఉంటాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిని ప్రజాభిప్రాయానికి ఉంచుతారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ప్రతిపాదిత డిజిటల్ ఐడీని కేంద్రప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27లోపు ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆధార్ కార్డుతో ఓటరు ఐడీ కార్డును కూడా లింక్ చేయాలన్న విషయంలో.. ఒక్కటైన ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకించాయి. కాగా సరికొత్తగా అందుబాటులోకి రానున్న సూపర్ డిజిటల్ ఐడెండిటీతో ఓటరు ఐడీని కూడా అనుసంధానం చేస్తారేమో వేచి చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles