ED takes Karvy MD Parthasarathy into custody కార్వీ ఎండీ పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

Ed arrests karvy group cmd parthasarathy cfo hari in money laundering case

Karvy MD Parthasarathy, Karvy chairman, Enforcement Directorate, CFO Hari, money laundering case, Nampally court, Karvy Group, Karvy CFO, MD Parthasarathy, security scam, Karvy MD Parthasarathy, Karvy CFO Hari, Nampally, Chanchalguda, Hyderabad, Telangana, Crime

The Enforcement Directorate (ED) took Karvy chairman and managing director Parthasarathy into custody in the alleged money laundering case. It is known the Nampally court remanded Parthasarathy to four-day judicial custody following which the ED took the Karvy MD into custody from Chanchalguda jail. After a medical examination, he was sent to ED office for questioning.

కార్వీ ఎండీ పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

Posted: 01/27/2022 04:26 PM IST
Ed arrests karvy group cmd parthasarathy cfo hari in money laundering case

 ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల మేర సెక్యూరిటీల కుంభకోణంలో కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జి.హరికృష్ణలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడం తెలిసిందే. మనీ లాండరింగ్‌ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు నాలుగు రోజుల జుడీషియల్‌ కస్టడీకి అనుమంతించింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను.. వైద్య పరీక్షల అనంతరం ఈడీ కార్యాలయానికి తరించారు. మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది. పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ వ్యవహారంపై సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోమవారం ఉదయం బెంగళూరులో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.

కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కాగా, కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకుని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles