Keshav Prasad Maurya ‘heckled’ in home seat యూపీ ఢిఫ్యూటీ సీఎం మొహం మీదే తలుపులు.. నిరసన

Up deputy cm keshav prasad maurya heckled in home seat bjp blames oppn

Keshav Prasad Maurya, UP polls, UP assembly elections, Keshav Prasad Maurya heckled, Keshav Prasad Maurya seat, UP news,

Uttar Pradesh Deputy Chief Minister Keshav Prasad Maurya had to face protests from women in his own assembly segment. Its videos have gone viral on social media. Maurya had gone to Sirathu in Kaushambi district for the first time after being declared a candidate for Sirathu seat and faced the protests of the women in kesaria village.

ఢిఫ్యూటీ సీఎం మౌర్యాకు పరాభవం.. మొహం మీదే తలుపులు వేసిన మహిళలు

Posted: 01/24/2022 03:51 PM IST
Up deputy cm keshav prasad maurya heckled in home seat bjp blames oppn

ఉత్తర​ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ​ప్రసాద్ ​మౌర్యకు పరాభవం ఎదురైంది. తన సొంత నియోజగవర్గం సిరాతూలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన ఆయనకు స్థానిక మహిళలు నుంచి నిరసనలు, చిత్కారాలు ఎదురయ్యాయి. స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మౌర్య తమ ఇళ్లకు వచ్చినా పలువురు మహిళలు ఆయన మొహం మీదే తలుపులు మూసేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో.. ఆయననే ఓబిసికి ప్రధాన ముఖచిత్రంగా పేర్కోంటూ బీజేపి ప్రచారం సాగిస్తున్న తరుణంలో మౌర్యకు తన నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.

గత రెండు పర్యాయాలుగా సిరాతూ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపోందుతూ తన పైచేయిని కనబర్చిన కేశవ్ ప్రసాద్ మౌర్యను ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన తన నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించగా, ఆయనకు కౌశాంబి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా స్వాగతం లభించింది. అయితే కేసరియా గ్రామంలోని మహిళలు మాత్రం నిరసనను తెలిపారు. ఆయన మొహంపైసే తలుపులు వేసి నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు నినాదాలు కూడా చేశారు. మూడురోజుల నుంచి కనిపించకుండా పోయిన జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేశ్ మౌర్య కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా పరామర్శించేందుకు వెళ్లారు.

ఈ క్రమంలోనే స్థానికులు.. డిప్యూటీ సీఎం రాగానే తలుపులు మూసుకున్నారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిశబ్దంగా ఉండాలని మౌర్య చేతితో సంజ్ఞలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే రాజేశ్​ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు బీజేపీ తెలిపింది. కాగా,  బాధితురాలి ఇంటికి చేరుకున్న కేశవ్ ప్రసాద్ మౌర్య.. దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని పోలీసులను ఆదేశించారు. రాజేశ్ మౌర్య విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విసుగెత్తిన మహిళలు ఇలా నిరసనను వ్యక్తం చేశారని బీజేపి వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles