Kodali Nani must not use filthy language urges: YCP leader కొడాలి నాని బాషను సవరించుకోవాలని సోంత పార్టీ నేత సూచన

Kodali nani must not use filthy language urges ysrcp leader subba rao gupta

Subbarao Gupta, YSRCP, Chandrababu Naidu, Kodali Nani, Gudivada, casino, Sankranti Celebrations, Krishna, TDP, YSRCP, Andhra Pradesh, Politics

Politics and Politicians May Change But Leaders Should Always be a role Model for the people, They Must Never Use Filthy Longing Urges YSRCP Leader Subbarao Gupta

కొడాలి నాని బాషను సవరించుకోవాలని సోంత పార్టీ నేత సూచన

Posted: 01/24/2022 01:54 PM IST
Kodali nani must not use filthy language urges ysrcp leader subba rao gupta

రాష్ట్రంలో సంక్రాంతి వేళ కృష్ణ జిల్లాలో రాజుకున్న క్యాసినో రగడ సోంత పార్టీ నేతలే వ్యతిరేకగళాన్ని వినిపించేలా చేస్తోంది. ప్రతిపక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు గుడివాడకు చేరుకుంటే.. వారికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలతో అడ్డుకుని.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చివేయగా.. వారి కార్యాలయాలపై రాళ్లు రువ్వించి. వాహనాలను ధ్వంసం చేయించిన ఘటనలతో ఇప్పటికే గుడివాడ అట్టుడికిపోతోంది. క్యాసినో నిర్వహించినట్లు ప్రతిపక్ష నేతలు అరోపణలు చేయడం కాదని., వారికి దమ్ముంటే సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేయడం, అందుకు టీడీపీ నేతలు సాక్ష్యాలు, ఆధారాలుగా క్యాసినో వీడియోలను కూడా పోస్టు చేయడంతో వ్యవహారం మరింతగా ముదిరింది.

ఈ క్రమంలో మాట మార్చిన మంత్రి కొడాలి నాని ఓటమిపాలైన నేతలు నిజనిర్థారణ అంటూ వచ్చారే తప్ప.. ప్రజామోదం ఉన్న ఒక్క నాయకుడు కూడా అక్కడకు రాలేదని.. ఇంతలా ప్రజలు వారికి బుద్దిచెప్పినా., వారి పరిస్తితిలో మార్పు రాలేదని మంత్రివర్యులు ఎద్దేవా చేశారు. ఇందుకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే ప్రతిస్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాము కృష్ణా జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో టీడీపీ పసువువర్ణపు జెండాను అవిష్కరిస్తామని.. అందులో గుడివాడకు చెందిన అసెంబ్లీ కూడా ఉండనుందని తేల్చిచెప్పారు. ఈ రగడ అలా నడుస్తుండగానే వైసీపీకి చెందిన నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా..  ఏపీ మంత్రి, క్యాసినో నిర్వహించాడనన్నా అరోపణలు ఎదుర్కోంటున్న కొడాలి నానిపై ఘాటుగానే స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా.. ఎంతో హుందాగా, ఉన్నతంగా వ్యవహరించాల్సిన కొడాలి నాని.. తన స్థాయిని తన చేజేతులా తగ్గించుకుంటున్నారని సుబ్బారావు గుప్తా ఆక్షేపించారు. రాష్ట్ర మంత్రివర్యులే ఇలాంటి బాషను వినియోగిస్తే.. రేపటి తరం దానినే అనుసరించే ప్రమాదముందని అన్నారు. కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని  అది అలాగే కొనసాగితే కార్యకర్తలే తిరగబడతారని సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి నాని వాడుతున్న భాష సరిగా లేదన్నారు. మంత్రి వాడుతున్న భాషకు కొందరు సంతోషిస్తున్నప్పటికీ ఎక్కువమంది మాత్రం చీదరించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.

మంత్రి నానిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని, ఆయన వాడుతున్న బాషతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని సూచించారు. కొడాలి నాని వినియోగిస్తున్న బాషతో జరిగే నష్టం గుడివాడకు మాత్రమే పరిమితం కాదని.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేలా ఉందని సూచనలు చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తానే గుడివాడ నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. ఒంగోలులో తన ఇంటిపై దాడిచేసిన వ్యక్తులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మంత్రి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఒంగోలులో మాఫియా నడుపుతుంటే బాలినేని మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని అన్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న టీడీపీ ఆరోపణల్లో నిజం లేకుంటే ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh