Free-thali lure costs Mumbai man Rs 1 lakh రూ.100కే భోజనం.. ఒకటి కొంటే రెండు మీల్స్ ఉచితం.. లక్షకు శఠగోపం

Credit card fraud free thali lure costs mumbai man rs 1 lakh

Credit card fraud, Free-thali, Mumbai man Rs 1 lakh lost, ND Nand, Deepak, call centre, credit card details, one-time password, Khar police station, call data, IT Act, Mumbai, Maharashtra, crime

The 74-year-old man, ND Nand, fell for prey to the fraudsters. Nand stated that he was asked to make an advance payment of Rs. 10 using his credit card and then pay the outstanding amount upon cash on delivery. Unfortunately, this credit card fraud hacked the card, and the man lost around Rs 49,760. The credit card fraud took place on January 9, 2022.

రూ.100కే భోజనం.. ఒకటి కొంటే రెండు మీల్స్ ఉచితం.. లక్షకు శఠగోపం

Posted: 01/24/2022 04:47 PM IST
Credit card fraud free thali lure costs mumbai man rs 1 lakh

నకిలీ ఆఫర్స్ పేరుతో వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని తమ విలువైన డబ్బును పొగుట్టుకుంటున్నారు. అయితే మోసపోయేవాడు ఉన్నంత వరకు తమకు అడ్డు అదుపు లేదని సైబర్ నేరగాళ్లూ నిత్యం ఏదో ఒక కొత్త ప్రణాళికతో సామాన్యులను అకర్షిస్తూనే వున్నారు, తాజాగా అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. ఒక్కటి కొంటే రెండు ఫ్రీ అన్న ప్రకటననే ఆయనను నిట్టనిలువునా ముంచింది. ఇక జీవితంలో నిజంగా హోటల్ వాళ్లే ఫ్రీ మీల్స్ అని చెప్పినా.. తినకుండా వచ్చేసేలా చేసిందీ అనుభవం. ఇక ఆయన మోసపోవడానికి కూడా సామాజిక మాధ్యమమే ఎర కావడం గమనార్హం. అదెలా అంటే వంద రూపాయల మీల్స్‌ ఆర్డర్‌ చేస్తే రెండు మీల్స్‌ ఫ్రీ అనే ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశాడు కాబట్టే.

ముంబైకి చెందిన 74 ఏళ్ల వృద్దుడు ఈ యాడ్ చూసి చూడంగానే టెంప్ట్ అయ్యాడు. అంతే మరో మాట ముచ్చట లేకుండా వెంటనే ఆర్డర్ చేసి మోసపోయాడు. క్రెడిట్‌ కార్డుతో రూ.10 చెల్లించి మిగిలిన రూ 90 పుడ్‌ డెలివరీ అయిన తర్వాత చెల్లించవచ్చని యాడ్‌లో పేర్కొనడంతో ఆశపడిన బాధితుడు క్రెడిట్‌ కార్డుపై ఏకంగా రూ లక్ష పోగొట్టుకున్నాడు. బాధితుడు ఎన్.డి నంద్ జనవరి 19న ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసి దాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సుమారు రూ.లక్ష వరకు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు.. " ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసి అందులో పేర్కొన్న కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేశాను. అప్పుడు, దీపక్ అనే పేరుతో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ.. ఫుడ్ ఆర్డర్ చేయడానికి నా క్రెడిట్ కార్డు వివరాలను అందించాలని కోరాడు.

మొదట్లో రూ.10 కట్ అవుతుందని, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత రూ.90 నగదు చెల్లిస్తే సరిపోతుందని ఆయన నాకు చెప్పారు. ఆర్డర్ బుక్ చేయడానికి ఒకసారి పాస్ వర్డ్ షేర్ చేయమని ఆ వ్యక్తి నన్ను అడిగాడు" అని పేర్కొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భాదితుడి లావాదేవీ నుంచి రూ.10 కట్ అయిన తర్వాత వెంటనే క్రెడిట్ కార్డు నుంచి రూ.49,760 కట్ అయినట్లు రెండు సార్లు ఎస్ఎంఎస్ వచ్చాయని తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరి ఖాతాలో క్రెడిట్ అయ్యిందో తెలుసుకోవడానికి బ్యాంకు నుంచి వివరాలను కోరాము" అని ఖర్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. సైబర్ మోసగాడిని ట్రాక్ చేయడానికి ఖర్ పోలీసులు కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. సైబర్ నెరగాళ్ల మీద ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles