Man with disability gets job offer from Anand Mahindra నెటిజనుల మనస్సును గెలుచుకున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్

Anand mahindra awestruck by double amputee s viral video offers him job

Anand Mahindra, Mahindra Logistics, Logistics Manager, business associate, Rampraveen Swaminathan, quadruple amputee, double amputee, rickshaw driver, Ram Mahindra Logistics amputee driver, Delhi, Mahindra, Anand Mahindra tweet, Delhi, viral video, Trending

A viral video of a quadruple amputee driving a modified vehicle in Delhi caught Anand Mahindra’s attention on Monday, prompting the industrialist to offer him a job. In the undated video, the man demonstrates how who rides the vehicle and turns it using it torso. The orange-coloured vehicle is fitting with the engine of a two-wheeler. He says he has two children, wife and his ageing father at home, and that he has been riding the vehicle for five years.

ITEMVIDEOS: నెటిజనుల మనస్సును గెలుచుకున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్

Posted: 12/28/2021 05:23 PM IST
Anand mahindra awestruck by double amputee s viral video offers him job

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆలోచనాత్మక పోస్టులు, వీడియోతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం మహీంద్రాకు ఇష్టం. తమ సొంత తెలివితేటలకు పనిచెప్పేవారిని శ్లాఘించడం ఆయనకు ప్రీతి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్ర్కాప్ గా మారిన వాహనాల విడిభాగాలతో జీపును తయారు చేయడం ఆయనను దృష్టిని ఆకర్షించింది. పేద వర్గాలు ఇలా తమ కుటుంబంతో పాటు వెళ్లే కళను సాకరం చేసుకోవడం బాగుందంటూ కితాబిచ్చిన ఆయన.. ఈ వాహనదారుడికి బొలెరో ఇస్తానంటూ ప్రకటించారు.

అంతేకాదు.. ఎవరైనా నిజమైన అవసరంలో వున్నారంటే.. వారు అడగకుండానే.. వారిని సంప్రదించకుండానే అన్నం పెట్టేందుకు ఆయన వెనుకాడరు. ప్రతిభ చాటుకున్నవారితో పాటు ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగానూ నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. వైకల్యానికి వెరువక, రోజువారీ జీవనంలో దూసుకెళ్తోన్న ఓ దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడయిన ఆయన.. అంతటితో ఆగకుండా, అతనికి తన సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్‌ చేయడం విశేషం. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను సోమవారం ట్వీట్‌ చేస్తూ.. ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశారు.

వీడియో చూస్తుంటే.. కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని ఓ వ్యక్తి.. తన లోపాలను అధిగమిస్తూ ఓ మోడిఫైడ్‌ వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ‘భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. అందుకే సంపాదన కోసం బయటకు వెళ్తున్నా. అయిదేళ్లుగా వాహనాన్ని నడుపుతున్నా’ అంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇది కాస్త.. ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ‘ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ.. తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఉన్నదాంతోనే కృతజ్ఞతా భావంతో మెలుగుతున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అని ఆనంద్‌ రాసుకొచ్చారు.

అంతటితో ముగించకుండా ఆయన మహీంద్రా లాజిస్టిక్స్‌ సంస్థలోని ఓ ఉద్యోగికి ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇతన్ని బిజినెస్ అసోసియేట్ గా చేర్చగలరా?’ అని అడిగారు. ఈ ట్వీట్‌ కాస్త వైరల్ గా మారడంతో.. నెట్టింట విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియో ట్వీట్‌కు 1.70 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు సైతం ఆ దివ్యాంగుడిని ప్రశంసిస్తూ.. ఆనంద్‌ మహీంద్రా చొరవను కొనియాడుతున్నారు. ఓ నెటిజన్‌.. అతన్ని దిల్లీలోని మోహ్రౌలి ప్రాంతంలో చూసినట్లు కామెంట్‌ పెట్టాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తుక్కుతో తయారు చేసిన వాహనాన్ని చూసి మెచ్చుకున్న మహీంద్రా.. అతనికి బొలెరో ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles