Two More Covid Vaccine Gets Approval By CDSCO మరో రెండు కరోనా వాక్సీన్లకు అనుమతి

Covavax corbevax vaccines anti viral drug molnupiravir approved for emergency use

Covavax, Covavax vaccine, Novavax Covavax vaccine, Corbevax, Corbevax vaccine, Corbevax covid vaccine, Biological-E covid vaccine, Biological-E covid vaccine Corbevax, Novavax covid vaccine, Novavax covid vaccine Covavax, Molnupiravir, anti-viral drug Molnupiravir, Molnupiravir anti-viral drug

The CDSCO approves another two covid-19 vaccines for emergency use in India. The two latest vaccines approved by CDSCO are Corbevax and Covavax. Corbevax, manufactured by Hyderabad-based firm Biological-E, is the first indigenously developed RBD protein subunit vaccine. While, Covavax, a nanoparticle vaccine, is manufactured by Pune-based firm Serum Institute of India.

అత్యవసర వినియోగానికి మరో రెండు కరోనా వాక్సీన్లకు అనుమతి

Posted: 12/28/2021 04:11 PM IST
Covavax corbevax vaccines anti viral drug molnupiravir approved for emergency use

దేశంలో కరోనా మహమ్మారిపై యుద్దాన్ని ప్రకటించిన కేంద్రం.. ఓ వైపు స్వదేశ పరిజ్ఞానంతో రూపోందించిన కరోనా వాక్సీన్ లను తయారుచేసి ప్రజలకు ఉచితంగా వేస్తూనే.. మరోవైపు విదేశీ పరిజ్ఞానంతో రూపోందించిన వైరస్‌లను కూడా ఉచితంగానే అందిస్తోంది. అదిచాలదన్నట్లు విదేశాలలో రూపోందించి, తయారు చేసిన వాక్సీన్లను కూడా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమేసేలా చేస్తున్న పోరాటాన్ని.. మరో రెండు నూతనంగా రూపోందించిన వాక్సీన్లకు అనుమతిస్తూ అమోదం తెలిపింది. కొవొవ్యాక్స్, కార్బివాక్స్‌ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది.

దేశంలోని 100 కోట్ల మందికి రెండు డోసులతో పాటు 60 ఏళ్లు పైబడి.. అనారోగ్య రుగ్మతలు వున్నవారికి ముందస్తు డోసుగా మూడవ డోసును కూడా అందించనుంది. ఇక తాజాగా 15 ఏళ్లకు పైబడిన చిన్నారులకు కూడా వాక్సీన్ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. జనవరి 3వ తేదీ నుంచి దానిని దేశవ్యాప్తంగా అమలుపర్చానుంది. ఈ క్రమంలో వాక్సీన్ డోసుల సంఖ్య మరింతగా అవసరం పడనున్న నేపథ్యంలో తాజాగా రెండు వాక్సీన్లను కూడా అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిల్లో కోవీషీల్డ్ కరోనా వాక్సీన్ రూపోందించిన సీరం సంస్థ నుంచే తయారైన ‘కోవోవాక్స్’ కాగా, మరోకటి బయోలాజికల్-ఈ లిమిటెడ్ సంస్థ రూపోందించిన ‘కార్బివాక్స్’ లకు డీజీసిఐ అనుమతినిచ్చింది.

కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ రెండు కరోనా వాక్సీన్ల వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డిజీసిఐకు దరఖాస్తు చేసింది. బ్రిటన్‌, అమెరికాల్లో చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్ డేటాను జతచేసింది. దీనిని పరిశీలించిన సీడీఎస్‌సీవో నిపుణుల బృందం అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్‌కు అనుమతినిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles