మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఆయనకు అసెంబ్లీలో జరిగిన పరాభవం గురించి.. ఆ తరువాత ఆయన మీడియాలో కన్నీళ్ల పర్యంతం కావడమే కాకుండా.. వెక్కి వెక్కి ఏడవటంపై కూడా ముద్రగడ ప్రస్తావించారు. చంద్రబాబు లాంటి రాక్షసానందం పోందే వ్యక్తికి కూడా కన్నీళ్లు ఇచ్చావా దేవుడా అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ జాతికి ఇచ్చిన హామీలను నిలపెబట్టుకోవాలని ఉద్యమం చేస్తే.. తనను.. తన భార్యను, తన కుమారుడు, కోడలు, మనవారాలితో పాటుగా మొత్తం కుటుంబాన్ని అనేక చిత్రహింసలకు గురిచేసి.. వాటిని భరించలేక తాము ఆత్మహత్యకు ఒడిగట్టాలని చర్యలు చేపట్టలేదా.? అని ప్రశ్నించారు.
అప్పుడు తాము అనుభవించిన మానసిక క్షోభ నీ వెక్కివెక్కి ఏడ్చిన దానికన్నా వంద రెట్లు అధికమని అన్నారు. తాను రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కాదని.. కేవలం తమ సామాజిక వర్గానికి ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించినందుకు తనను ఎంతగా అవమానించాడో ఆయనకు అప్పడు తెలియదు.. కనీసం ఇప్పుడైనా తెలుసుకోవాలి. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యమం చేస్తే.. తనను.. తన కుటుంబాన్ని చాల హేయమైన రీతిలో అన్ని విధాలుగా అవమాన పరిచారని అన్నారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు తనను బూటు కాలితో తన్నారు. తన కుటుంబ సభ్యులందరినీ బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారని అరోపించారు.
14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో తనను తనతో పాటు తన భార్యను ఏ కారణంతో బంధించారో చెప్పాలి. కనీసం సాన్నం చేయడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన ఘటనలు మీకు గుర్తులేవా.? అని ప్రశ్నించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారని అరోపించారు. మీ హయాంలో కాపు కుల రిజర్వేషన్ల కోసం పోరాడిన తనపై.. మీ హయాంలో చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామని అవేదన వ్యక్తం చేశారు. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. అని ప్రశ్నించారు.
అయితే కాలక్రమేనా ఆత్మహత్య దిశగానూ అలోచనలు వెళ్లాయని.. అయితే ఇన్నాళ్లు పోరాటయోధుడిగా వున్న తాను ఆత్మవంచన చేసుకోలేక బతికి ఉన్నానని అన్నారు. భూమి గుండ్రంగా వుందని, తన కుటుంబాన్ని అవమానపరచిన చంద్రబాబు పతనం తన కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని అన్నారు. తన కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. సానుభూతి పొందే అవకాశం చేస్తున్నారు. కానీ నా విసయంలో మాత్రం సానుభూతి రాకుండా మీడియాను బంధించి అనాధను చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు శపధాలు.. నీటి మీద రాతలని' ముద్రగడ తన లేఖలో రాసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more