Man Sacrifices Car To Save Unconscious Driver మనిషి ప్రాణం కోసం రిస్క్.. తన కారును ఢీకొనేలా చేసి..

Man sacrifice his own car to save unconscious driver in the vehicle behind

Car accident, Netherlands Man sacrifices Car, Netherlands Man, sacrifices Car, unconscious driver, dashcam, viral video, highway car crash, Trending video

A man in the Netherlands sacrificed his car to save the life of an unconscious driver who had lost control of her car. The video shows a car, which looks like it's out of control, moving at a steady speed on a grass patch next a highway. Though the car bumps into the guardrail, it continues to move.

ITEMVIDEOS: మనిషి ప్రాణం కోసం రిస్క్.. తన కారును ఢీకొనేలా చేసి..

Posted: 11/22/2021 08:16 PM IST
Man sacrifice his own car to save unconscious driver in the vehicle behind

సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్ గా డ్రైవ్‌ చేస్తున్నా.. మరీ వేగంగా దూసుకెళ్లినా లేక నిర్ణీత వేగం కన్నా మరీ నెమ్మదిగా నడిపిస్తున్నా.. ట్రాఫిక్ ను బ్లాక్ చేస్తున్నారే అని మనకు చాలా కోపం వస్తుంది. మేం పనిమాళ రోడ్డుపైకి వచ్చామా.? లేక వీరు వచ్చారా.? ఏంటో మరీ ఈ విపరీత ధోరణి అని అనుకుంటాం. ఎందుకంటే రోడ్లపై మరీ ర్యాష్ గా వెళ్లినా.. లేక మరీవేగంగా వెళ్లినా.. లేక నిర్ణత స్పీడు కంటే నెమ్మెదిగా వెళ్లినా.. అది ప్రమాదాలకు, లేక ట్రాఫిక్ జామ్ లకుకారణం కావచ్చు. ఇక మరికొందరు రోడ్డుపైనే పక్కకు తమ వాహనాలను అపేసి వెళ్లాలా.? వద్దా అన్న మిమాంసాలో ఉంటారు. వీరి వల్ల భయంకరమైన ప్రమాదాలు జరిగే అస్కారం లేకపోలేదు.

వీళ్లకు అస్సలు డ్రైవింగ్ సెన్స్ లేదు.. ప్రమాదాలు జరుగుతున్నా.. బుద్ధి రాదు.. అని అనుకుంటాం.. ఇక అక్కడితో ఆగకుండా.. వారిని ఓవర్ టేక్ చేసిమరీ వారి వాహనంలోకి ఓ టుక్  వేసి ఇదేం డ్రైవింగ్ రా బాబు అన్నట్టుగా చూస్తాం. అది మానవ సహజం. సహనం కోల్పోయిన వారైతే ఓ మాట కూడా అనేస్తారు. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదపు అంచున నిలేచేలా చేసింది. అయితే ఇలాగే రియాక్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఈ కారు డ్రైవర్ కూడా ఆ కారులోకి ఓ టుక్ ఇచ్చాడు. అయితే కారులోకి చూస్తూనే అతడి కోపం అంతా పోయింది. ఎందుకన్న వివరాల్లోకి వెళ్తే..

ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు.

అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్‌ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles