Karnataka to soon have anti-conversion law: CM Bommai మత మార్పిడి నిరోధకచట్టాన్ని తీసుకువస్తున్న ఆ రాష్ట్రం..

Karnataka to soon have anti conversion law says chief minister basavaraj bommai

Basavaraj bommai, CM Karnataka, anti-conversion law, sriram sena, Hindu Janajagruti Samiti, religious conversions, forced conversion, allurement conversions, Pramod Muthalik, Santhosh Guruji, Siddalinga Swami, Pranavananda Swami, Bengaluru, karnataka, Politics

Karnataka Chief Minister Basavaraj Bommai said the state will soon have an anti-religious conversion law. Speaking to reporters in Bengaluru, Bommai said, "The state government is studying related laws enacted by other states and soon an anti-conversion legislation will be formulated." He was replying to a query on the meeting with a group of seers, seeking a ban on religious conversion.

మత మార్పిడి నిరోధకచట్టాన్ని తీసుకువస్తున్న ఆ రాష్ట్రం..

Posted: 11/13/2021 07:11 PM IST
Karnataka to soon have anti conversion law says chief minister basavaraj bommai

కర్ణాటకలోని బసవరాజు బొమ్మై ప్రభుత్వం రాష్ట్రంలోని బలవంతపు మతమార్పిడులపై కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే అశలతో ప్రజలను మతమార్పిడులు చేస్తున్నఘటనలపై కూడా కొరడా ఝళిపించనున్నారు. త్వరలోనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. మత మార్పిడిని నిరోధించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. బలవంతపు మత మార్పిడిలను రాజ్యాంగం ఒప్పుకోదని అన్నారు.

మరోవైపు హిందూ మత పరిరక్షణ కోసం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపిన ఆయన పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు చర్చలు కూడా జరుపుతున్నారు. ఇందులో భాగంగా 50 మందికి పైగా హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు ఇటీవల బొమ్మైను కలిశారు. బలవంతపు మత మార్పిడిలపై నిషేధం విధించాలని సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో హిందూ జనజాగృతి సమితి కన్వీనర్ మోహన గౌడ, శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాళిక్, సంతోష్ గురూజీ, సిద్ధలింగ స్వామి, ప్రణవానంద స్వామి తదితరులు ఉన్నారు.

హిందూ జనజాగృతి పమితి మోహన గౌడ అధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీరామ్ సేన చీప్ ప్రమోద్ ముతాళిక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్కూళ్లు, ఆసుపత్రులను మతమార్పిడిలకు ఉపయోగించుకుంటున్నారని అరోపించారు. రాష్ట్రంలో అక్రమంగా ఎన్నో చర్చిలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. అయితే కొందరు అమాయక ప్రజలను పలు రకాల తాయిలాలు చూపించిం వారిని ఆశతో మతమార్పిడులు చేస్తున్నారని అరోపించారు. మతాన్ని మార్చుకునే ఎస్సీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలని సీఎంకు వీరంతా సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles