Delhi Govt Decides To Close Schools For A Week ఇంట్లోనూ మాస్క్‌లు ధ‌రిస్తున్నాం.. 2 రోజులు లాక్‌డౌన్ పెట్టండి: చీఫ్ జ‌స్టిస్‌

After sc concerns on air pollution delhi govt decides to close schools for a week

CJI NV Ramana, Delhi air pollution, masks, supreme court, school children. pollution. delhi schools shut, delhi government, Arvind Kejriwal, Central Government, corona virus, Lungs expose, emergent steps, air pollution, NV Ramana, CJI, Justice Surya Kant, Justice DY Chandrachud, alarming situation

Expressing serious concern towards the probable effect of Delhi's present air pollution crisis on the health of school going children, the Supreme Court on Saturday asked the Delhi Government what steps have been taken in that regard.

సుప్రీం అదేశాలు: ఢిల్లీలో వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవు

Posted: 11/13/2021 06:23 PM IST
After sc concerns on air pollution delhi govt decides to close schools for a week

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఢి్ల్లీలోని అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రవైటు, ఎయిడెట్ పాఠశాలలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్థాయని తెలిపింది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం చేరుకుందని. ఈ నేపథ్యంలోనూ తమ పిల్లలను ఉదయాన్నే పాఠశాలలకు పంపాల్సి వస్తుందన్న బాధను వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది.

అయితే ఢిల్లీ ప్రభుతం ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయాలే కారణం. హస్తినతో పాటు ప‌రిస‌రాల్లో వాయు నాణ్య‌త క్షీణిస్తోంద‌ని, ప్ర‌జ‌లు ఇంట్లో కూడా మాస్క్‌లు ధ‌రిస్తున్నార‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో చూస్తున్నారు క‌దా, మేం మా ఇండ్ల‌ల్లో కూడా మాస్క్‌లు ధ‌రిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. క్షీణిస్తున్న వాయు నాణ్య‌తతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారిన‌ట్లు చీఫ్ జస్టిస్ అన్నారు. జ‌డ్జిలు కూడా త‌మ ఇండ్ల‌ల్లో మాస్క్‌లు ధ‌రిస్తున్నార‌న్నారు.

సీజే ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, సూర్య‌కాంత్‌ల‌తో కూడిన ప్ర‌త్యేక ధ‌ర్మాస‌నం పిటిష‌న్ విచార‌ణ చేప‌ట్టింది. ఇటీవల ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా దేశ రాజధాని ఢి్ల్లీలో విపత్కర పరిస్థితులు అలుముకున్నాయని వ్యాఖ్యలు చేశారని, ఓ వైపు కరోనా వైరస్, మరో వైపు డెండ్యూ దాడి చేస్తుండగా, ఇంకో వైపు నుంచి వాయు కాలుష్యం కూడా కబళించేస్తోందని.. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. పాఠశాలలు ఢిల్లీ విద్యాశాఖ పరిధిలోనే వున్నాయి కదా.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనవెంటనే చర్యలు తీసుకుంని వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

అంతకుముందు ఇదే విషయంగా కేంద్రప్రభుత్వ తరపు న్యాయవాది తుషార్ మెహతా సైతం న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి రెండు రోజులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించలేరా.? అని కూడా ప్రశ్నను సంధించింది. ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్‌, ప‌శ్చిమ యూపీలో రైతులు పంట‌ల్ని కాలుస్తున్న ఘ‌ట‌న‌ల‌ను అదుపు చేసేందుకు ఢిల్లీ, కేంద్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధ‌ర్మాస‌నం సూచించింది. రైతుల‌కు హ్యాపీ సీడ‌ర్ మెషీన్లు స‌ప్ల‌య్ చేయాల‌ని కోర్టు చెప్పింది.

ల‌క్ష‌ల సంఖ్య‌లో హ్యాపీ సీడ‌ర్ మెషిన్లు ఉన్న‌ట్లు మీరు చెబుతున్నారు, కానీ రైతులు ఆ మెషీన్ల‌ను ఖ‌రీదు చేయ‌లేర‌ని, పంట వ్య‌ర్ధాల‌ను కాల్చ‌కుండా.. ఆ దాణాను మేక‌లకు వేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జ‌స్టిస్ సూర్య‌కాంత్ తెలిపారు. రెండు ల‌క్ష‌ల సీడ‌ర్ మెషీన్లు 80 శాతం స‌బ్సిడీ రేటుకు అందుబాటులో ఉన్నాయ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలిపారు. తాను రైతునే అని, సీజేఐ కుటుంబం కూడా రైతు ఫ్యామిలీ అని, ఆ మెషీన్ల క‌చ్చిత‌మైన ధ‌ర ఎంతో చెబుతారా అని సూర్య కాంత్ ప్ర‌శ్నించారు. దానికి బ‌దులిస్తూ.. స‌హ‌కార సంఘాలు ఆ మెషీన్ల‌ను ఉచితంగా ఇస్తున్న‌ట్లు తుషార్ మెహ‌తా చెప్పారు.

ఏక్యూఐని 500 నుంచి 200కు ఎలా త‌గ్గిస్తాం, ఏవైనా అత్య‌వ‌స‌ర నిర్ణ‌యాలు తీసుకోండి, రెండు రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేస్తారా.. ఇంకేదైనా ప్లాన్ ఉందా.. ప్ర‌జ‌ల ఎలా బ్ర‌తుకుతార‌ని సీజే ర‌మ‌ణ‌ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో చిన్న పిల్ల‌ల‌ను స్కూల్‌కు పంపుతున్నాం, వాయు కాలుష్యానికి వాళ్ల‌ను ఎక్స్‌పోజ్ చేస్తున్నామ‌ని ఎయిమ్స్ వైద్యులు చెప్పార‌ని సీజే గుర్తు చేశారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని, ఈ లోగా ఏదైనా అర్జెంట్ నిర్ణ‌యం తీసుకోవాల‌ని, లాంగ్ ట‌ర్మ్ ప‌రిష్కారం గురించి త‌ర్వాత ఆలోచిద్దామ‌ని కోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh