Missing girl found after using TikTok hand signals కిడ్నాపర్ నుంచి యువతని రక్షించిన టిక్ టాక్..

Teen rescued after showing domestic violence hand signal known on tiktok

Tic Tok gesture, tic tok hand gesture, distress, help, Canadian Women’s Foundation, 16-year-old girl, abductor, kidnapper, Tik Tok, domestic violence signal, hand signal, North Carolina, Tennessee, Kentucky, Ohio, US, Crime

TikTok video recently helped rescued a 16-year-old girl after using hand signal as she was being kidnapped in the US. The girl flashed the hand signal from a car on a Kentucky interstate, the authorities said. It was created as a way for people to indicate that they are at risk of abuse and need help. The 16-year-old was spotted travelling inside a silver Toyota near London, Kentucky, about 150 miles south-east of Louisville, on 4 November.

ITEMVIDEOS: టిక్ టాక్ సిగ్నెల్ వినియోగించి.. కిడ్నాపర్ నుంచి బయటపడ్డ బాలిక

Posted: 11/10/2021 05:43 PM IST
Teen rescued after showing domestic violence hand signal known on tiktok

చిన్నారులు, మైనర్లకు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ లోనే మునిగితేలుతున్నారు. నిత్యం సెల్ ఫోన్లేనా అని పెద్దలు తిట్టినా.. వాటి నుంచి బయటకు రావడంలేదు. ఈ క్రమంలో ఓ మైనర్ యువతి టిక్ టాక్ వీడియోను వినియోగించి.. తనను తాను కిడ్నాపర్ చెర నుంచి రక్షించుకుంది. తనను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు.. తనను ఏం చేయాలని తలచారో తెలియదు.. కానీ ఈ నెల 4న కిడ్నాప్ కు గురైన తాను అమెరికాలోని నాలుగు రాష్ట్రాలలో కిడ్నాపర్ కారులో సంచరించింది. త‌న ప‌ని అయిపోయింద‌ని భావించింది. అయితే తనను ఆదుకునే తరోణోపాయం ఒక్కటేనని టిక్ టాక్లో చూసిన వీడియో ఐఢియాను వినియోగించింది.

తనకు తారసపడే అన్ని కార్ల వద్ద అమె అదే మాదిరిగా చేతితో ఎదుటివారికి సిగ్నల్ అందించింది. కానీ నాలుగు రాష్ట్రాలలో అమె జారీ చేసిన చేతి సిగ్నల్ ను గుర్తించిన ఓ కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పాటు ఆ కారును కూడా ఫాలో అయ్యాడు. దీంతో పోలీసులు ఆ కారును ఆపి యువతిని రక్షించారు. అమె సిగ్నల్ ను గుర్తించిన వ్యక్తిని అభినందించారు. కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ యువతికి వచ్చిన ఆ ఐడియా ఏంటీ.. అన్న విషయం తెలుసుకోవాలని వుందా.? అమెను టిక్‌టాకే ఎలా కాపాడింది.. అన్న వివరా్లలోకి ఎంట్రీ ఇస్తే..

యూఎస్‌లోని నార్త్ క‌రోలినాకు చెందిన 16 ఏళ్ల యువ‌తి.. న‌వంబ‌ర్ 2 న మిస్ అయింది. త‌న త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. రెండు రోజుల కింద ఆ యువ‌తి ఆచూకి కెంటుక్కీలో ఓ కారులో ల‌భించింది. అది కూడా కారులో కూర్చున్న ఆ యువ‌తి చేసిన హాండ్ సిగ్న‌ల్ ద్వారా. సిల్వ‌ర్ క‌ల‌ర్ ట‌యోటా కారులో ఆ యువ‌తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండ‌గా.. ఆ యువ‌తి.. బ‌య‌ట ఉన్న ఓ వ్య‌క్తికి హాండ్ ద్వారా సిగ్న‌ల్ ఇచ్చింది. అది టిక్‌టాక్‌కు చెందిన సిగ్న‌ల్. నేను ప్ర‌మాదంలో ఉన్నాను. నాకు సాయం కావాలి.. అనే విధంగా ఆ యువ‌తి టిక్ టాక్‌లో వాడే సిగ్న‌ల్ ను అక్క‌డ చేసింది. దీంతో బ‌య‌ట ఉన్న వ్య‌క్తికి అనుమానం వ‌చ్చి వెంట‌నే 911కు కాల్ చేసి.. ఆ కారును ఫాలో అయ్యాడు.

వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కారును అడ్డగించి.. ఆ యువ‌తిని కాపాడి.. త‌న‌ను కిడ్నాప్ చేసిన వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అత‌డిని 61 ఏళ్ల జేమ్స్ హెర్బెర్ట్ బ్రిక్‌గా గుర్తించారు. త‌న‌ను నార్త్ క‌రోలినాలో కిడ్నాప్ చేసి టెన్నెస్సీ, కెంటుక్కీ. ఒహియో మొత్తం తిప్పాడ‌ని తెలిపింది. ఓహియోలో కిడ్నాపర్ కు తెలిసిన వ్యక్తులు కలిసారని, ఆ సమయంలో తనను చూపిస్తూ.. ఈ అమ్మాయి మైన‌ర్ అని.. మిస్సింగ్ రిపోర్ట్ కూడా త‌న మీద న‌మోదు అయింద‌ని ఆ వ్య‌క్తి చెప్పార‌ని.. దీంతో రూట్ మార్చి త‌న‌ను వేరే ప్రాంతానికి త‌ర‌లించ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని ఆ యువ‌తి పోలీసుల‌కు తెలిపింది.

చివ‌ర‌కు ఓ మోట‌రిస్ట్ సాయంతో.. టిక్‌టాక్ సిగ్న‌ల్స్ చేయ‌గా.. తాను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది. సోష‌ల్ మీడియాలో గృహ హింస‌, హెల్ప్ చేయండి, నేను ప్ర‌మాదంలో ఉన్నాను.. అనే వాటిని సూచించే విధంగా హాండ్ సిగ్న‌ల్స్ పాపుల‌ర్ అయ్యాయి. టిక్‌టాక్‌లో కూడా ఈ హాండ్ సిగ్న‌ల్స్‌కు సంబంధించిన వీడియో బాగా పాపుల‌ర్ అవ‌డంతో టిక్‌టాక్‌ను ఉప‌యోగించి ఆ యువ‌తి మొత్తానికి కిడ్నాప‌ర్ నుంచి త‌ప్పించుకోగ‌లిగింది. త‌న‌ను కిడ్నాప్ చేసి వ్య‌భిచార‌ గృహానికి త‌ర‌లించ‌డం కోసం ప్ర‌య‌త్నించాన‌ని.. ఆ యువ‌తిని కిడ్నాప్ చేసిన వ్య‌క్తి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 16-year-old girl  abductor  kidnapper  Tik Tok  domestic violence signal  hand signal  North Corolina  US  Crime  

Other Articles

Today on Telugu Wishesh