Pre-wedding photo shoot turns horribly wrong for a couple ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న కాబోయే జంట

Couple gets stuck in a waterfall during the pre wedding shoot video goes viral

pre-wedding photo shoot, waterfall, couple stuck in waterfall, Chulia Falls, would-be couple, Rana Pratap Sagar Dam, groom Ashish Gupta, bride Shikha, Himanshu, MilanKota, Rawatbhata area, Chittorgarh, Rajasthan, Crime

A pre-wedding photo shoot turned horribly wrong for a couple from Rajasthan on Tuesday after they got stuck in a gushing waterfall and had to be rescued after an extensive exercise lasting around three hours.

ITEMVIDEOS: ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న కాబోయే జంట

Posted: 11/10/2021 04:35 PM IST
Couple gets stuck in a waterfall during the pre wedding shoot video goes viral

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు.. అన్న విషయం తెలిసిందే. కానీ పెళ్లికి ముందే ఫోటో షూట్ పేరుతో ప్రకృతి రమణీయమైన స్థలాలకు వెళ్లి అక్కడ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ తీసుకోవడం.. సంగీత్ సహా పలు కార్యక్రమాలను కూడా పెళ్లికి ముందు నిర్వహించడం సంపన్న కుటుంబాల్లో అనవాయితీగా వస్తోందే. అయితే ఇలానే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చేరువలోని జ‌ల‌పాతం వ‌ద్ద‌కు వెళ్లిన ఓ కాబోయే జంట చిక్కుల పాలైంది. నడిసంద్రంలో నావలా మారిన వారి పరిస్థితి నుంచి ఆదుకునేందుకు పోలీసు దళాలతో పాటు సంబంధిత అధికారులు కూడా మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.

అయితే పరిస్థితి తారుమారు అవుతోందని గమనించిన ఫోటోగ్రాఫర్ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశాడు. కాగా, కాబోయే వధూవరులతో పాటు వారి వెంటి వచ్చిన మరో ఇద్దరు యువతులు మాత్రం చిక్కకుపోయారు. బతుకుజీవుడా అంటూ పరుగు పెట్టిన ఫోటోగ్రాఫర్ ఒడ్డుకు చేరే క్రమంలో ఆయన ఫోటో కెమెరా కూడా పడిపోయింది. దీంతో కష్టపడి అక్కడకు చేరినా.. వారి జ్ఞాపకాలుగా నిలవాల్సిన ఫోటోలన్నీ చెరిగిపోయాయి. ఆయన వెళ్లి విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంలో వారు రంగంలోకి దిగి కాబోయే వధూవరులతో పాటు ఇద్దరు యువతులను కూడా మూడు గంటల పాటు శ్రమించి రక్షించారు.

ఇంతకీ ఎం జరిగిందీ అంటారా.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం రాజస్థాన్ లోని కోటా ప్రాంతానికి చెందిన కాబోయే జంట చులియా వాటర్ ఫాల్స్ ప్రాంతానికి చురుకుంది.అక్కడి అధికార యంత్రంగం మందలిస్తున్నా.. వాటిని పెడచెవిన పెట్టిన జంట వాటర్ ఫాల్స్ మధ్యలోకి వెళ్లి పోటోలకు ఫోజులచ్చింది. ఈ క్రమంలో రాణా ప్రతాప్ సాగర్ డ్యాప్ గేట్లను అధికారులు తెరిచారు. దీంతో క్రమంగా నీటి ఉదృతి పెరగసాగింది. కొత్త జంట.. వారివెంట వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు యువతుతో క‌లిసి అందులోనే ఇరుక్కుపోయారు. వారి చుట్టూ ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున నీటి ప్ర‌వాహం పెరిగిపోవ‌డంతో కొన్ని గంట‌ల పాటు నీటి మ‌ధ్య‌ బండ రాయి మీదే బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉండిపోయారు.

అయితే నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో గమనించిన ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి బయటకు రావాలని వారికి కోరాడు. అయితే వారు వినిపించుకోలేదు. అయితే ఎలాగోలా తప్పించకుని ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఫోటోగ్రాఫర్ కెమెరా కూడా నీటిలో పడిపోయింది. అయినా సరే వదిలేసి ఒడ్డును చేరాడు ఫోటోగ్రాఫర్. ఇక పరిస్థితి తారుమారు కాకముందే విషయాన్ని పోలీసులకు చెప్పి వధూవరులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. వదూవరుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, అధికారులకు విషయాన్ని తెలిపారు.

దీంతో పోలీసులు రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగి నలుగురిని బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించాయి. ఫలితంగా కాబోయే జంటతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా సురక్షితంగా బయటకు రాగలిగారు. ఈ ఘ‌ట‌న రాజస్థాన్ లోని  రావత్‌భటా జిల్లాలోని చులియా జలపాతం వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ లోని నాలుగు గేట్లను తెరిచి నీటిని వదలడంతో వ‌ధూవ‌రులు అందులో చిక్కుకున్నార‌ని వివ‌రించారు. వివాహనికి ముందే కష్టాన్ని ఎదుర్కోన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహంబంధంతో ఒక్కటి కానుంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles